వీడు మామూలోడు కాదు..!

news02 Feb. 19, 2019, 11:09 p.m. general

sales_men_shouting_pakisthan_murdabad

డిల్లీ ; మ‌నిషికి బుర్ర ఉండాలే కాని.. ఎప్పుడు..? ఎక్క‌డైనా..? వ్యాపారం చేయ‌వ‌చ్చు.. అవును. పైన క‌నిపిస్తున్న ఈ యువ‌కుడు.. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిణామాల‌నే త‌న వ్యాపారానికి వాడ‌కుని లాభాలు గ‌డిస్తున్నారు. అదేలా అంటా..?  మొన్న‌టి పుల్వామాలో ఉగ్ర‌దాడి లో49 మంది భార‌త సైనికులు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు పాకిస్తాన్ పై ఆగ్ర‌హంతో ఊగిపోతున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా దీన్నే ఈ యువ‌కుడు త‌న బూట్ల అమ్మ‌కాల‌ను పెంచుకోవ‌డానికి వాడుకుంటున్నారు. "పాకిస్తాన్ ముర్దాబాద్ .. పాకిస్తాన్ ముర్దాబాద్ ".. ప‌ద‌కొండు వంద‌ల‌కు  మూడు జ‌త‌ల బూట్లు ..కొనండి..కొనండి..అంటూ అమ్ముతుండ‌టం అంద‌రిని ఆక‌ర్షిస్తుంది.డిల్లీలోని క‌రోల్ బాగ్ లో  ఇలా అమ్ముతున్న‌ ఈ వ్య‌క్తి ఫోటో.. ఇప్పుడు సోష‌ల్ తెగ మీడియాలో హ‌ల్ చేస్తుంది.  ఏదైనా ఇత‌ని తెలివికి మెచ్చుకోవ‌ల్సిందే. ప్ర‌జ‌ల్లో ఉన్న‌సెంటిమెంట్ రెచ్చ‌గోట్ట‌డం ద్వారా దేశ‌ భ‌క్తులు .. పాకిస్తాన్ ముర్దాబాద్ కోస‌మైనా.. ఆ బూట్ల‌ను కొంటున్నార‌ట‌. అందుకే అంటారు తెలివైన వ్యాపారి.. అవ‌స‌ర‌మైతే ఇసుక‌లో తైలంబు తీయ‌గ‌ల‌డు అని పెద్ద‌లు ఊర్కేఅన‌లేదు.

 

tags: delhi karol bhagh, shoes sale, pakisthan murdabad, shouting salesmen, indian, pulwama terrarist attack, kashmir, indian army

Related Post