చర్యలు తీసుకోవాలన్న తమన్నా..

news02 Aug. 13, 2018, 3:16 p.m. general

tamanna

విజయవాడ- ఆంద్రప్రదేశ్ టీడీపీ ఎంపి శివప్రసాద్ పై తమన్నా పోలీసులకు పిర్యాదు చేసింది. శివప్రసాద్ పై తమన్నా ఎందుకు పిర్యాదు చేసిందబ్బా అని అనుకుంటున్నారా.. ఐతే మీరనుకుంటున్నట్లు సినిమా హీరోయిన్ తమన్నా కాదు. ట్రాన్స్ జెండర్స్ అసోషియేషన్ ప్రతినిధి తమన్నా పిర్యాదు చేసిందన్నమాట. పార్లమెంట్ ఆవరణలో ట్రాన్స్ జెండర్ వేషధారణలో నిరసన తెలిపిన ఎంపీ శివప్రసాద్ తమను అవమానించారని తమన్నా ఆరోపించింది. 

tamannah

మహిళలతో సమానంగా తాము సమాజంలో జీవిస్తుంటే.. శివప్రసాద్ తమను అవమానించే విధంగా ప్రవర్తించారని.. ఆతనిపై చర్యలు తీసుకోవాలని తమన్నా విజయవాడ గవర్నర్ పేట పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. ఇక ఎంపీ శివప్రసాద్ తమకు క్షమాపణ చెప్పాలని సైతం తమన్నా డిమాండ్ చేసింది. మరి ఎంపీ శివప్రసాద్ తమన్నా పిర్యాదుపై ఎలా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది,

tags: shivaprasad, mp shivaprasad, tamanna, tamannah, tamannah on shivaprasad, tamannah police complint on shivaprasad, tamannah complint on mp shivaprasad

Related Post