కొడుకు ఆరాచ‌కాల ముందు ఓడిపోయిన తండ్రి మ‌మ‌కారం

news02 June 2, 2018, 11:45 a.m. general

son murder by father

జిగిత్యాల: కొడుకు అరాచ‌కాల ముందు పేగు బంధం ఓడిపోయింది. బాధ్య‌త లేని కుమారుడి చేష్ట‌ల ముందు తండ్రి మ‌మ‌కారం చ‌చ్చిపోయింది. చిన్న‌ప్పుడు చిన్ని త‌న‌యుడు చేసిన చిలిపి చేష్ట‌లను చూసి సంతోషించిన తండ్రి... పెద‌య్యాక కుమారుడు చేసిన వికృత చేష్ట‌ల‌ను భ‌రించ‌లేక‌పోయాడు. అందుకే తాగుడుకు బానిసై, భార్యా బిడ్డల‌ను వ‌దిలేసి.. క‌న్న త‌ల్లిదండ్రుల ప‌ట్లే క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించిన పేగు బంధాన్ని తుంచేశాడు. ఏ చేతుల‌తోనైతే ప్రేమతో పెంచుకున్నాడో... అదే చేతుల‌తో కుపుత్రుడిని మ‌ట్టుబెట్టాడు. గొడ‌లితో అత్యంత కిరాత‌కంగా న‌రికి చంపేశాడు. విషాదక‌ర‌మైన ఈసంఘ‌ట‌న శుక్ర‌వారం జ‌గిత్యాల జిల్లా చోటుచేసుకుంది. 

ravi

జగిత్యాల మండలం పొరండ్లకు చెందిన‌ బోదనపు రాజం-లక్ష్మి దంపతులకు ర‌వి(40) ఒక్క‌డే కుమారుడు.  ఒక్క‌డే కొడుకు కావ‌డంతో... అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. ఓ ఇంటి వాణ్ని కూడా చేశారు. ర‌వికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు. అయితే పెళ్లైన ర‌వి భార్యా, పిల్ల‌ల‌తో హాయిగా ఉంటాడ‌నుకున్న రాజం-ల‌క్ష్మి దంప‌తుల ఆశ‌లు ఆవిర‌య్యాయి. కుటుంబ ప‌ట్ల బాధ్య‌త‌తో ఉంటాడ‌నుకున్న కొడుకు దారి త‌ప్పాడు. కొంతకాలంగా మ‌ద్యానికి బానిసైన ర‌వి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలనూ నిత్యం కొడుతూ వేధించ‌డం మొద‌లు పెట్టాడు. అయితే అత‌ని అరాచ‌కాల‌ను భ‌రించ‌లేని త‌ల్లిదండ్రులు, భార్య అత‌నికి దూరంగా వెళ్లిపోయారు. భార్య పుట్టింటికి వెళ్లిపోగా... త‌ల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓఅపార్ట్‌మెంట్‌లో ప‌నికి కుదిరి అక్క‌డే ఉంటున్నారు. 

ravi murder  seen

అయితే అయిన‌వాళ్లు దూర‌మైన ర‌విలో మాత్రం కించ‌మెత్తు కూడా మార్పు రాలేదు. ఫుల్‌గా మ‌ద్యం కొట్టి మ‌త్తులో గోడ దూకి రెండు కాళ్లు విర‌గ్గొట్టుకున్నాడు. అయితే కొడుకు ప‌రిస్థితిని చూసిన తండ్రి రాజం...ప‌నిరాని కొడుకు ఉంటే ఎంత...? పోతే ఎంత‌...? అని అనుకున్నాడ‌మో..? శుక్ర‌వారం ఉద‌యం ర‌వి మంచంపై నిద్రిస్తున్న స‌మ‌యంలో... గొడ్డ‌లితో క‌సి తీరా న‌రికి చంపేశాడు. అనంత‌రం రాజం దంప‌తులిద్ద‌రూ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి తామే చంపేసిన‌ట్లు ఒప్పుకొని పోలీసుల‌కు లొంగిపోయారు. 

ravi murder seen

అయితే కొడుకు చంపిన రాజం అక్క‌డి నుంచి న‌వ్వుతూ... వెళ్లిపోయిన‌ట్లు స్థానికులు చెప్ప‌డం విశేషం.  రాజం చేసిదాంట్లో త‌ప్పేమి లేద‌ని.. స్థానికులు చ‌ర్చించుకోవ‌డం కొస‌మెరుపు. త‌ల్లిదండ్రుల‌కు సేవ చేయాల్సిన స‌మ‌యంలో భార్యాబిడ్డ‌ల‌ను వ‌దిలేసి త‌ల్లిదండ్రుల‌కు భార‌మైనందుకు ర‌వికి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని స్థానికులంటున్నారు. 

tags: son murder by father, jagityala son murder,borandla,police station

Related Post