టెంట్ వేసి మరీ చేశాడు..

news02 May 16, 2018, 7:38 p.m. general

భోపాల్ (నేషనల్ డెస్క్)- సాధారనంగా పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణులైతే తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. తమ సంతోషాన్నిచుట్టుపక్కల వాళ్లని, బంధువులను ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చే మరీ పంచుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఐతే ఇందు భిన్నంగా వ్యవహరించాడో తండ్రి. మిత్రులను.. తెలిసిన వాళ్లను, బంధువులను ఇంటికి పిలిచి.. ఇంటి ముందు టెంట్ వేసి మరీ పార్టీ ఇచ్చాడు. అంతే కాదు బాణాసంచా సాల్చి మరీ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. ఇందులో ఏముందిలే.. కాస్త ఎక్కువ టెంప్ట్ అయ్యాడని అనుకుంటున్నారా.. ఐతే అసలు విషయం వేరే ఉంది...

మధ్యప్రదేశ్‌ లోని భోపాల్ కు చెందిన సురేంధ్ర కుమార్ కుమారుడు అశు ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే తన కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు పార్టీ ఇచ్చి అందరిని ఆశ్చర్.పరిచాడాయన. పరీక్షలో ఫెయిల్ అయిన తన కుమారుడిని తిట్టి, కొట్టకుండా వినూత్నంగా ఇంటి ముందు టెంటు వేసి ఘనంగా పార్టీ ఇచ్చాడు. స్నేహితులు, బంధువులను పిలిపించి స్వీట్లు పంచి వారితో కలిసి టపాసులు పేల్చాడు. ఈ విషయం స్థానిక మీడియా వర్గాలకు తెలియడంతో వారంతా సురేంద్ర ఇంటికి వచ్చారు. 

సాధారనంగా కొడుకు ఫెయిల్‌ అయితే తిట్టి.. కొట్టేవారినే చూశాం.. మరి ఇలా కొడుకు ఫెయిల్ అయికే పార్టీ ఎందుకు ఇస్తున్నారని సరేంద్రకుమార్ ను అడిగితే.. ఫలితాలు అంత ప్రధానం కాదన్న ఆయన.. మా అబ్బాయి చదవనందుకు ఫెయిల్‌ అవ్వలేదు. వాడు చాలా కష్టపడ్డాడు. పరీక్షలకు మించి జీవితంలో ఇంకా ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. వాడు ఫెయిల్‌ అయ్యాడని నేను కొడితే అది మనసులో పెట్టుకుని ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే తట్టుకోలేను. దాని బదులు ఇలా పార్టీ ఇచ్చి వాడిని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాని చెప్పుకొచ్చాడు.

ఈ మధ్య పిల్లలు పరీక్షల్లో ఫెయిల్‌ అయితే మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పిల్లలందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన పరీక్షలే ఆఖరి పరీక్షలు కావు. అంతకంటే జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. మా అబ్బాయి ఈ ఏడాది ఫెయిల్‌ అయ్యాడు. వచ్చే ఏడాది తప్పకుండా పాస్ అవుతాడని చెప్పాడు సురేంద్రకుమార్.
చల్లి
ఇలా సురేంద్ర కుమార్ తన కుమారుడి విషయంలో తీసుకున్న వినూత్న నిర్ణయం అందరిని ఆలోచనల్లో పడేసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలను.. ఇతర పిల్లలతో పోల్చుతూ తిట్టే తల్లిదండ్రులను చెంపపెట్టులా ఉంది. ఇక ఫఐనల్ టచ్ ఎంటంటే... నన్ను ఏమీ అననందుకు మా నాన్నకు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని నాన్నకు మాటిస్తున్నానని చెప్పాడు అశు.

bhopal

 

tags: bhopal, bhopal student, fail student, ssc faild, bhopla student ashu

Related Post