భారత కమాండర్ పై దాడి

news02 Feb. 27, 2019, 7:09 p.m. general

commander abhinandan

పాకిస్థాన్ పాశవిక మనస్థత్వం మరోసారి బయటపడింది. భారత్‌ వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌పై పాక్‌ ఆక్రమిత కశ్మీర్లో దాడి జరిగింది. మిగ్‌ -21 బైసన్‌ విమానం కూలిపోయే సమయంలో కమాండర్ అభినందన్ సురక్షితంగా కిందకు దిగారు. ఐతే ఆయన పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని ఓ నదీ పరీవాహక ప్రాంతంలో నేలపైకి పారాషూట్ సాయం దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానం కూలిపోవడాన్ని గమనించిన పాకిస్థాన్ సైనికులు, కొందరు స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటి వరకు భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ఒంటిమీద ఎలాంటి గాయాలూ లేవు. ఐతే కాసేపటికే ఒక సైనిక స్థావరంలో ఆయన చేతులు వెనక్కి కట్టేసి తీసిన వీడియోలో మాత్రం ఆయన కంటి వద్ద గాయాలు ఉన్నట్లు కన్పిస్తోంది. దీంతో ఆయనపై దాడి జరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. కమాండర్ అభినందన్ ను స్థానికులు పట్టుకున్నప్పుడు కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది.

tags: abhinandan, iaf wing commander abhinandan, pakistan attack on iaf commander, pakistan people attack on iaf wing commander,

Related Post