వాహ‌న‌దారుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఐఓసీ

news02 May 30, 2018, 5:26 p.m. general

ioc slide

ఢిల్లీ: ఆశ ప‌డ్డొని నోట్లో పాసు ప‌డిన‌ట్లైంది వాహ‌న‌దారుల ప‌రిస్థితి. పెట్రోలుపై 60, డీజీల్‌పై 59 పైస‌లు త‌గ్గించిన‌ట్లు  ఐఓసీ ప్ర‌క‌టించిన‌... అర్ధ గంట‌లోనే వారి ఆశ‌లు ఆవిర‌య్యాయి. త‌గ్గించింది 60 పైస‌లు కాదు... ఒక్క పైసే అని చెప్పి ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ వాహ‌న‌దారుల‌ను వేల‌కోలం చేసింది. 20 రోజులుగా పెట్రో ఉత్ప‌త్తుల‌పై వినియోగ‌దారుడి న‌డ్డీ విరిగిలా రెట్లు పెంచి... ఇప్పుడు ఒక్క పైసా త‌గ్గించి వాహ‌న‌దారుల‌పై జోకులు వేస్తోంది. 

IOC

అవును...ఐఓసీ వాహ‌న‌దారుల‌తో ఒక ఆటాడుకుంటుంది. అస‌లే పెరిగిన ధ‌ర‌ల‌తో వాహ‌న‌దారులు బెంబేతెత్తుంటే... ఐఓసీ చావు క‌బురును చ‌ల్ల‌గా చెబుతుంది. పెట్రో మంట‌తో సామాన్యుడు తెగ‌బాధ‌ప‌డుతుంటే... అందులోనే ఆయిల్ కంపెనీలు త‌మ కాసుల పంట పండించుకుంటున్నాయి. 

ioc 2

బుధ‌వారం ఐఓసీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. మొద‌ట పెట్రో, డీజెల్ ధ‌ర‌ల‌ను 60, 59 పైస‌లు త‌గ్గించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రెట్లు బుధ‌వారం నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌ని కూడా వెల్ల‌డించింది. అయితే ఏమైందో తెలియ‌దు కానీ, ఐఓసీ వెంట‌నే స‌వ‌ర‌ణ ప్ర‌క‌ట‌న చేసింది. పొర‌పాటు జ‌రిగినందుకు క్ష‌మించండి...వెబ్‌సైట్లో రెట్లు త‌ప్పుగా న‌మోద‌య్యాయి తెలిపింది. పెట్రోలుపై 60, డీజెల్‌పై 59 త‌గ్గించ‌లేద‌ని వెల్ల‌డించింది. మొత్తంగా పెట్రో ఉత్ప‌త్తుల‌పై త‌గ్గించింది ముష్టి ఒక్క పైసేన‌ని స్ప‌ష్టం చేయ‌డం విశేషం. 

ioc 3

అయితే ఐఓసీ గంద‌ర‌గోళ‌మైన ప్ర‌క‌ట‌న‌పై వాహ‌న‌దారులు మండిప‌డుతున్నారు. వినియోగ‌దారుల‌ను బ‌పూన్ల‌ను చేసేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌మేమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా పెట్రో ధ‌ర‌ల‌పై ప్ర‌జ‌ల‌కు ఆమోద‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటే బాగుంటుంద‌ని కోరుతున్నారు. 

tags: IOC,petro rates,diesel,petrol,oil companies,

Related Post