ట్రాయ్ ఛైర్మెన్‌కు త‌గిన బుద్ధి చెప్పిన నెటిజ‌న్లు, హ్యాక‌ర్లు

news02 July 31, 2018, 11:40 a.m. general

rs sharma

ఢిల్లీ: టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్‌) ఛైర్మెన్ ఆర్‌.ఎస్ శ‌ర్మను నెటిజ‌న్లు, హ్యాక‌ర్లు ఓ ఆటాడుకుంటు న్నారంటా...! ఆయ‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల‌న్నింటిని బ‌హిర్గ‌తం చేసేశారంటా..! ఆయ‌న‌కున్న 6 బ్యాంకు అకౌంట్ల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టేశారంటా..! ఈ-మెయిల్, ఆయన అడ్రస్, పాన్ కార్డు, ఓట‌ర్ కార్డు, ఎయిర్ ఇండియా ఆయ‌న‌కిచ్చిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీలు ఇలా దేన్ని వ‌ద‌ల‌కుండా ప‌బ్లిక్ చేసేశారంటా..! 

rs sharma

ఇక‌ మ‌రికొంద‌రు హ్యాకర్లయితే ఏకంగా ఆయ‌న వివ‌రాల‌తో కూడిన దొంగ ఆధార్ కార్డును తయారు చేసి ఫేస్‌బుక్‌, అమెజాన్ క్లౌడ్ సర్వీసుల్లో రిజిస్టర్ కూడా అయిపోయారంటా..! ఇంకొంద‌రైతే.. పేటీఎం, భీమ్ యాప్‌ల ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా త‌ల ఒక్క రూపాయిని ఆయ‌న అకౌంట్‌కు జ‌మ చేసి ఝ‌ల‌కివ్వ‌డం విశేషం. 

rs sharma

అయితే ఆర్‌.ఎస్ శ‌ర్మ విసిర‌న స‌వాల్ నేప‌థ్యంలోనే నెటిజ‌న్లు, హ్యాక‌ర్లు ఇలా ఆయ‌న‌తో ఆడుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్‌.ఎస్ శ‌ర్మ ఆధార్‌ నంబర్‌, త‌న వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేసి... ఎవ‌రికైనా ద‌మ్ముంటే దుర్వినియోగం చేయాల‌ని స‌వాల్ చేయ‌డంతో... హ్యాక‌ర్లు సీరియ‌స్‌గా తీసుకొని ఈ ప‌ని చేశారంటా...! ఈమేర‌కే ఆయ‌న‌కు బుద్ధి చెప్పేందుకు ఆయ‌న వ్య‌క్తిగ‌త స‌మాచారాన్నంతా బ‌హిర్గ‌తం చేసేశారంటా..! సో... మొత్తానికి ఆర్‌.ఎస్ శ‌ర్మ తానేదో త‌లుస్తే... భ‌గ‌వంతుడు మ‌రోటి త‌ల‌చిన‌ట్లు... హ్యాక‌ర్లు, నెటిజ‌న్లు ఆయ‌న‌తో బాగానే ఆడుకున్నారన్న మాట‌.

tags: rs sharma,aadhar card,

Related Post