3రోజులు రైల్లోనే జ‌ర్నీ

news02 May 30, 2018, 2:45 p.m. general

train lo dead body
పాట్నా: సాధార‌ణంగా గుర్తు తెలియ‌ని శ‌వం ఆచూకీ తెలిస్తే... పోలీసులేం చేస్తారు..వీలైనంత త్వ‌రగా పంచ‌నామా నిర్వ‌హించి బంధువులు, కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తారు. అప్ప‌టికీ బంధువులు, కుటుంబీకులు ఎవ‌రూ రాకుంటే... డిపార్ట‌మెంట్ వారే ద‌హ‌న సంస్కార‌ణ‌లు చేస్తారు. కానీ, రైల్వే పోలీసులు, అధికారులు మాత్రం క‌నీస మాన‌వ‌త్వం మ‌ర‌చిపోయారు. రైల్లో మృత‌దేహం మూడు రోజుల పాటు ప్ర‌యాణం చేసిన ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. అత్యంత విచార‌క‌ర‌మైన ఈసంఘ‌ట‌న పాట్నా-కోటా ఎక్స్‌ప్రెక్స్‌లో చోటుచేసుకుంది. 

railway police

యూపీ కాన్పూర్‌కు చెందిన సంజ‌య్ కుమార్  ఈనెల 24న పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌లో వివాహ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఆగ్రా బ‌య‌లుదేరి వెళ్లాడు. అయితే ఇంత‌కు ముందే ఆయ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య ఉండ‌డంతో.. ఆయ‌న భార్య సంజ‌య్ కు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకాబ్ చేసింది. దీంతో సంజ‌య్ ఆమెకు కొంత న‌ల‌త‌గా ఉన్న‌ట్లు చెప్పాడు. వీలైతే ముందు వ‌చ్చే ఎదైనా స్టేష‌న్‌లో దిగిపోతాన‌ని చెప్పాడు. 

sajay wife

అయితే త‌ర్వాత సంజ‌య్ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో..ఆమె గాబ‌ర ప‌డిపోయింది. రైల్వే అధికారుల‌కు ఫోన్ చేసి ప‌రిస్థితి వివ‌రించింది. రైల్వే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే రైల్వే అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో...పాపం సంజ‌య్ మృత‌దేహం రైల్లోనే పాట్నా-కోటా మ‌ధ్య చ‌క్క‌ర్లు కొట్టింది. దాదాపు 72 గంట‌ల పాటు రైల్లోనే మృత‌దేహం ప్ర‌యాణించింది. మృతుడు ఎక్క‌డైతే రైలెక్కాడో చివ‌ర‌కు అక్క‌డికే వ‌చ్చే వ‌ర‌కు పోలీసులు గుర్తించ‌క‌పోవ‌డం విశేషం. మొత్తంగా రైల్వే అధికారుల నిర్వాహ‌కం మూల‌న ఓనిండు ప్రాణం పోయింద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌కాలంలో సంజ‌య్‌కి వైద్యం అందించి ఉంటే బ‌తికేవాడ‌ని... అంతేకాకుండా చ‌నిపోయిన త‌ర్వాత కూడా మృత‌దేహాన్ని కుటుంబానికి అందించ‌డంలో రైల్వే అధికారులు ఘోరంగా విఫ‌లం చెందార‌ని మండిప‌డుతున్నారు. 

tags: trian death, sanjay,wife,railway police, indiciplane of police

Related Post