ఇంట్లో అంద‌రూ దొంగ‌లే

news02 June 5, 2018, 12:26 p.m. general

tirupati theift
తిరుప‌తి: హ‌రారే గ్యాంగు గుర్తుందా...? అదేనండీ ఖాకీ సినిమాలో త‌మిళ యంగ్ హీరో కార్తీక్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ. ఇందులో హ‌రారే గ్యాంగు దొంగ‌ల‌కు ఎలా పాల్ప‌డిందో తెలుసు కాదా. త‌ర త‌రాలుగా దొంగ‌తనాన్నే వృతిగా న‌మ్ముకొని హ‌రారే గ్యాంగు చేసిన దొంగ‌త‌నాలు గుర్తున్నాయి క‌దా. అయితే అంత‌లా కాకున్నా...ఇలాగే ఓ కుటుంబం మొత్తం దొంగత‌న‌మే వృత్తిగా ఎంచుకొని దోపిడులు, దొంగ‌త‌నాలు చేస్తూ... సంచ‌ల‌నంగా మారిన అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను తిరుప‌తి పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే హ‌రారే గ్యాంగులో దొంగ‌త‌నం  చేసే వారు మ‌గ వారు కాగా... ఇక్క‌డ మాత్రం ఒకే కుటుంబానికి చెందిన మ‌హిళ‌లే దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డడం విశేషం. 

tirupati gold chene recovery

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠాపై 100కు పైగా కేసులుండ‌డం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ జాత‌ర్లు జ‌రిగినా..వీరు అక్క‌డ వాలిపోతుంటారు. బ‌స్టాండ్లు, ఉత్స‌వాలు, జాత‌ర్లు వంటి ప్రాంతాల్లో వీరు తిష్ట‌వేసి దోపీడులు చేస్తుంటారు. అయితే చేసేది చిల్ల‌ర దొంగ‌త‌నాలే అయినా... వీరు జీవ‌న శైలి మాత్రం కాస్లీగా మెంటెయిన్ చేస్తుండ‌డం విశేషం. ఖ‌రీదైన హోట‌ళ్ల‌ల్లో దిగి..కాస్లీ ఫుడ్, ఖ‌రీదైన దుస్తులు, అభ‌ర‌ణాలు వేసుకొని దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు. 

tirupati temple

అయితే సోమ‌వారం ఇలాగే పద్మావతి అమ్మవారి మెట్లపై దొంగ‌తానికి సిద్ధ‌మ‌వ్వ‌గా... అక్క‌డే గ‌స్తీలో ఉన్న సీఐ పద్మలత అండ్ టీంకు వీరి వైఖ‌రిపై అనుమానం వచ్చింది. దీంతో వీరిని విచారించ‌గా..అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీరి నుంచి రూ.6.42 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంత పెద్ద‌స్థాయిలో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన ఈదొంగ‌లు మ‌న హైద‌రాబాదీలే కావ‌డం విశేషం. అంతేకాదు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారంటా..! ప‌ట్టుబ‌డిన సయ్యద్ రషీద్ బేగం (58), లక్ష్మీ అలియాస్ మీరున్నీసా (35), సోనీ అలియాస్ రిజ్వానా (19) ముగ్గురు అమ్మ‌, అమ్మ‌మ్మ‌-మ‌న‌వారాళ్లేన‌ని పోలీసులు చెబుతున్నారు.  సో భాగ్య‌న‌గ‌రంలో మాకేం అవుతుంది లే అనుకున్న వాళ్లు కొంచెం జాగ్ర‌త్త‌గా ఉంటే మంచింది మ‌రి.

tags: tirupati theift, hyderabadi decoits,interstate commerce theft,interstate car theft,interstate theft definition,interstate identity theft,interstate theft loss report,interstate theft of stolen property,interstate theft of firearms interstate shipment theft

Related Post