వరవర రావు అరెస్ట్..

news02 Aug. 28, 2018, 2:53 p.m. general

varavararao

హైదరాబాద్- విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణల నేపధ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీలుకున్నారు. ఈ మేరకు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసుల బృందం వరవరరావుతో పాటు, ఆయన కుమార్తె ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఆ తరువాత వరవరరావును అరెస్ట్ చేసి.. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అటు నుంచి నాంపల్లి కోర్టులో వరవరరావును హాజరు పరిచి అక్కడి నుంచి పూణేకు తరలించినట్లు తెలుస్తోంది. 

modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని.. ఐతే సదరు కుట్రలో విరసం నేత వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో పోలీసుల దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉండటంతో ఆయనపై కోసు నమోదు చేశారు. మరోవైపు మావోయిస్టులకు నిధులు సమకూర్చడంలోను వరవరరావు కీలక పాత్ర పోషిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వరవరరావును అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం పూణేకు తరలించినట్లు సమాచారం.

tags: modi, varavararao, vara vara rao, varavara rao, varavara rao arrest, maharastra police arrest varavara rao, varavara rao arrested by pune police, varavara rao plan to pm modi murder

Related Post