పట్టించుకోని అమెరికా కాన్సులేట్..

news02 June 24, 2018, 10:52 a.m. general

us sex rocket

హైదరాబాద్- తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ వ్యవహారం చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంపైనా చూపుతోంది. అమెరికా సెక్స్ రాకెట్ నేపధ్యంలో వీసాలకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన సిఫారసు లేఖను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదట. వచ్చే నెలలో అమెరికాలో జరిగే అమెరికా తెలంగాణ తెలుగు మహాసభలకు ముఖ్యమైన నేతలు, కళాకారులు మొత్తం 24 మందికి విసాలు జారీ చేయాలని సీఎం కార్యాలయం హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కు సిఫారసు చేస్తూ ఓ లేఖను పంపించింది.

ఐతే అమెరికా కాన్సులేట్ కార్యలయం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన లేఖను సీరియస్ గా తీసుకోలేదట. అమెరికా సెక్స్ రాకెట్ దుమారం రేపుతున్న నేపధ్యంలో అందరికి వీసాలు ఇవ్వడం కుదరని తేల్చి చెప్పిందని సమాచారం. ఇక సీఎం కార్యాలయం 24 మందికి విసాల కోసం సిఫారసు చేస్తే.. అమెరికా కాన్సులేట్ మాత్రం కేవలం నలుగురికి మాత్రమే విసాలు జారి చేసి.. మిగతా 20 మందికి వీసాలను తిరస్కరించిందట. మొత్తానికి అమెరికా సెక్స్ రాకెట్ కాస్త ఒక్క తెలుగు సినిమా పరిశ్రమపైనే కాదు.. చాలా రంగాలపై ప్రభావం చూపుతోందన్నమాట.

tags: cm, cm kcr, kcr, cm letter, chicago sex rocket, amerika visa, us consulate, us rejects visa

Related Post