ఆర్టీసీ బ‌స్సు-లారీ ఢీకొని 6గురు మృతి

news02 May 29, 2018, 10:50 a.m. general

lorry-bus accident
క‌రీంన‌గ‌ర్: కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. లారీ-ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మానకొండూరు మండలం చెంజర్ల వద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం ఈఘ‌ట‌న‌లో చోటుచేసుకుంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 

lorry-bus accident

ప్ర‌మాదం జ‌రిగిన చోట క్ష‌త‌గాత్రుల‌తో ర‌హ‌దారి ర‌క్త‌సిక్తంగా మారింది. గాయ‌ప‌డిన వారి హార్త‌నాదాల‌తో ప‌రిస్థితి బీతావాహంగా మారింది. బ‌స్సు ఓవైపు సైడ్ పార్ట్ మొత్తం ప్ర‌మాద దాటికి లేచిపోయింది. గాయ‌ప‌డి బ‌స్సుల్లో చిక్కున్న వారిని బ‌య‌ట‌కు తీసేందుకు అధికారులు, స్థానికులు  తీవ్రంగా శ్ర‌మించి క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఉన్న‌తాధికారులు సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 

lorry-bus accident 2

ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణ‌మ‌ని స‌మాచారం. వేగంగా వెళ్లుతున్న రెండు వాహ‌నాలు ఢీకొన‌డంతోనే తీవ్ర న‌ష్టం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

tags: lorry-rtc bus accident, chenjarla accident, karimnagar accident, bus accident, lorry accident,

Related Post