నార‌సింహుని బ్రంహోత్స‌వం ..!

news02 March 7, 2019, 11:56 a.m. general

YADADRI

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశారు  ఆలయ అధికారులు. స్వస్తివాచనంతో ఈ నెల 8 నుంచి యాదాద్రి దేవస్దానం వార్షికోత్సవాలు బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న ఎదుర్కోలు , 15న స్వామి వారి కళ్యాణం , 16న రధోత్సవం జరగనున్నాయి. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు  అధికారులు. బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు , విద్యుత్ దీపాల అలంకరణ, వివిధ రకాల పూలతో పుష్పాలంకరణ చేశారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

YADADRI

తిరుపతిగా పేరొందిన యాదాద్రి దేవస్దానం బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు రంగం సిద్దం చేశారు .11 రోజుల పాటు వెయ్యి మందికి నిత్య అన్నదానం కార్యక్రమం జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాచకొండ కమిషనరేట్ పోలీసులు  భద్రతను కట్టుదిట్టం చేశారు. కొండ పైకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. వి.వి.ఐ.పి ల రాకపోకలు ఎక్కువగా ఉండనుండడంతో పోలీసు శాఖ నిత్య పర్యవేక్షణను మరింత పటిష్టం చేసింది. వి.ఐ.పీలకు , దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీ సౌకర్యం కల్పించారు. 

YADADRI

tags: YADADRI BRAHMOTSAVALU,YADADRI TEMPLE,YADAGIRI GUTTA,THIRUPATHI,THIRUMALA,NARASIMHA SWAMI,VENKATESHWARA SWAMI,YADAGIRI,KCR,TELANGANA THIRUPATHITELANGANA

Related Post