ఫైన్ వేసిన బ్యాంకు అధికారులు..

news02 June 10, 2018, 8:25 a.m. general

yogi

ఉత్తర్ ప్రదేశ్ (నేషనల్ డెస్క్)- ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రాని పెద్ద. మరి ఆయనిచ్చిన చెక్కు చెల్లదని ఎవరైనా అనుకుంటారా.. ఎవ్వరు అనుకోరు కదా.. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కే బౌన్స్ అవ్వడంతో అంతా అవాక్కయ్యారు. టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాకు చెందిన అలోక్‌ మిశ్రా పదోతరగతి బోర్డు పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. దీంతో అతడిని అభినందిస్తూ.. గతనెల 29న లఖ్‌నవూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లక్ష రూపాయల చెక్కు అందించారు. ఇంకేముంది సదరు విధ్యార్ధి.. వారి తల్లితండ్రుల సంతోషానికి అవధుల్లేవు.

cm yogi

ఐతే తీరా బ్యాంకుల్లో చెక్కు వేశాక అది చెల్లదని తేలడంతో తెల్లమొహం వేశారు. బారాబంకీ జిల్లా పాఠశాలల డైరెక్టర్ రాజ్‌కుమార్‌ యాదవ్‌ సంతకంతో ఆ చెక్కు జారీ అయింది. ఈ చెక్కును కుమారుడి ఖాతాలో జమ చేసేందుకు అలోక్‌ తల్లిదండ్రులు ఈ నెల 5న చెక్కును బ్యాంకులో వేశారు. రెండు రోజులైనా డబ్బు జమకాకపోవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరాతీశారు. సీఎం ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో చెక్కు నిరాదరణకు గురికావడంతో అలోక్‌కు ఫైన్ వేశారట బ్యాంకు అధికారులు. ఐతే చెక్కు ఎందుకు చెల్లుబాటు కాలేదన్నదానిపై స్పష్టచ లేదు.

tags: cm yogi, cm adithyanath, cm check bounce, up cm check bounce

Related Post