మహిళలను ఈడ్చుకెళ్లిన గొలుసు దొంగలు

news02 Feb. 13, 2018, 3:41 p.m. general

Chain snatchers hulchal

చెన్నై : చైన్ స్నాచర్లు బరి తెగించారు. మహిళల మెడలో బంగారం కోసం వాళ్ళ ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. చెన్నై లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బంగారం కోసం మహిళలను రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ తంతంగం అంత సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

చెన్నై లోని అమ్‌బాక్కమ్‌ లో జరిగిన ఘటనలో బైక్‌పై వచ్చిన ఇద్దరు చైను దొంగలు 52 ఏళ్ల మహిళ మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. చైన్ చేతికి రాకపోవటం తో మహిళ కింద పడింది. అయిన గోలుసును విడవని దొంగలు ఆ మహిలను ఈడ్చుకుంటూ వెళ్లారు. చెన్నై నగరం లొనే మరో ఘటనలో కున్రతూర్‌కు చెందిన 57 ఏళ్ల జయశ్రీ తన భర్తతో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెపై పడి ఏడు తులాల బంగారు గొలుసును ఒక యువకుడు లాక్కుని వెళ్ళిపోయాడు.దొంగను పట్టుకునేందుకు భర్త చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. గొలుసు దొంగల చేతిలో గాయపడిన ఇద్దరు మహిళలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిసి కెమెరా ఫుటేజ్ చూస్తున్న చెన్నై ప్రజలు ఆందోళన కు గురవుతున్నారు.

tags: Chain snatchers, chennai crime, rash behaving ,

Related Post