58.3 కోట్ల ఖాతాల‌ను మూసేసిన ఫేస్‌బుక్

news02 May 16, 2018, 11:14 a.m. general

facebook
వాషింగ్ట‌న్: ఫేక్ అకౌంట్ల‌పై ఫేస్ బుక్ ఉక్కుపాదం మోపింది. న‌కిలీ ఖాతాల భ‌ర‌తం ప‌ట్టింది. హింసాత్మ‌క‌, సెక్సువ‌ల్‌, టెర్ర‌రిజం, విద్వేష‌పూరిత‌, అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్ గ‌ల అకౌంట్ల‌ను ఫేస్‌బుక్ మూసేసింది. అలాంటి న‌కిలీ ఖాతాల‌ను క్లోజ్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు ఇలాంటీవి 58.3 కోట్ల ఖాతాలున్న‌ట్లు గుర్తించిన ఫేస్ బుక్‌.. వాటి అకౌంట్ల‌ను మూసేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కూ ఈఖాతాల‌ను డిలీట్ చేసిన‌ట్లు తెలిపింది. న‌కిలీ అకౌంట్ల‌తో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని భావించే.. వాటిని క్లోజ్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. 

face book 2

కొన్ని సంస్థ‌లు త‌మ పబ్లిసీటి కోసం ఫేస్‌బుక్‌ను వేదిక చేసుకున్న‌ట్లు ఈసంస్థ‌ వెల్ల‌డించింది. ఫేస్‌బుక్ ద్వారా రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, వ్యాసాలు పోస్టు చేస్తున్న‌ట్లు తెలిపింది. అందుకోసం ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ స‌హాయంతో ఫేక్ అకౌంట్ల‌ను గుర్తించిన‌ట్లు వెల్ల‌డించింది. అందులో భాగంగానే ఫేస్‌బుక్ మొత్తం ఖాతాల్లో 3-4 శాతం న‌కిలీ అకౌంట్లు ఉన్న‌ట్లు గుర్తించి వాటిని మూసేసిన‌ట్లు చెప్పింది. అంతేకాకుండా స్పామ్ తో కూడిన 83.7 కోట్ల పోస్టుల‌ను సైతం ఫేస్‌బుక్ ఇప్ప‌టికే తొల‌గించిన విష‌యం తెలిసిందే.

tags: facebook accouts close, jukenburg,washington,amerika,socialmedia,media

Related Post