ఆగిపోయిన చంద్రయాన్-2

news02 July 15, 2019, 9:28 p.m. general

chandrayan-2

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2  అర్ధంతరంగా ఆగిపోయింది. జీఎస్‌ఎల్వీ మార్క్‌3 ఎం1 ద్వారా సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్‌-2ను ప్రయోగించేందుకు సిద్దం చేశారు. జీఎస్‌ఎల్వీ మార్క్‌3 లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. చంద్రయాన్-2 ప్రయోగ సమయానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌ డౌన్‌ ఆగిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో ఆపేసింది. మళ్లీ చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆదివారం సాయంత్రమే షార్‌కు చేరుకున్నారు. రెండవ ప్రయోగ వేదిక వద్దకు వెళ్లి జీఎ్‌సఎల్వీ-మార్క్‌3ఎం1 రాకెట్‌ను కోవింద్‌ తిలకించారు. షార్‌లో నూతనంగా నిర్మించిన రెండవ వాహన అనుసంధాన భవనాన్ని పరిశీలించారు. చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా పడటంతో ఆయన ఢిల్లీకి వెనుతిరిగారు.

tags: chandrayan, chandrayan-2, chandrayan-2 cancelled, chandrayan-2 postponed, chandrayan-2 isro, isro chandrayan-2, technical problem in chandrayan-2

Related Post