హైదరాబాద్ లో యాసిడ్ రైన్

news02 March 17, 2018, 3:19 a.m. general

Acid rain in hyderabad

హైదరాబాద్ :నగరంలో భయంకరమైన వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి నెలకొన్న వాతావరణమే దీనికి కారణం. చిన్న చిన్నగా కురుస్తున్న జల్లులు మామూలు వర్షం కాదు. అది యాసిడ్ రైన్ అని తేలింది. ఎప్పుడు ఎలాంటి ప్రకృతి విలపానికి అవకాశం లేని హైదరబాద్ లీక్ యాసిడ్ రైన్స్ కురవడం ఆందోళనకరంగా మారింది.

శుక్రవారం ఉదయమే హైదరాబాద్ లో చిరుజల్లులు కురిశాయి. అవి మామూలు వర్షమే అనుకొని బయలు దేరిన సిటీ జనం రోడ్లపై పరిస్థితిని చూసి విస్తుపోయారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్, లాలపేట్ ఫ్లై ఓవర్ లపై పదుల సంఖ్యలో టూ వీలర్ వాహన దారులు జారి కింద పడ్డారు. ముందు ఇదేదో ఆయిల్ లీక్ అయ్యింది. దీని వల్ల వాహనాలు జారి పడ్డాయని అధికారులు భావించారు. కానీ తీరా చూస్తే సిటీ లో అక్కడక్కడ టూవీలర్ వాహన దారులు ప్రమాదాలకు లోనయ్యారు. దీంతో హైద్రాబాద్ లో యాసిడ్ రైన్ కురుస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ యాసిడ్ వర్షం తో ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వర్షంలో తడవడం.. ఈ గాలిని పీల్చడం తో ఊపిరి తిత్తుల వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని తెలుగులో ఆమ్ల వర్షం అంటారు. వేసవి కాలం ప్రారంభం ఇలాంటి వర్షాలు మాములే నని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ జనం మాత్రం బెంబేలెత్తుతున్నారు.

Related Post