చివ‌ర‌కు జైలు ఉచ‌లు లెక్క పెడుతున్న వివాహిత‌

news02 July 6, 2018, 5:32 p.m. general

fake mother

హైద‌రాబాద్‌: అమ్మ...ఇంత క‌న్న క‌మ్మ‌ని ప‌ద‌మేముంటుంది. అమ్మ‌లోని అనుభూతి, మ‌మ‌కారం, క‌మ‌నీయ‌త అది ఒక బిడ్డ‌కే సొంతం. అందుకే జీవితంలో పిల్ల‌లు క‌లగ‌ని ఎంతో మంది మ‌హిళ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తుంటారు. ఎత్తుకోవ‌డానికి ఒక న‌లుసైనా పుట్టాక పాయోనని తెగ బాధ‌ప‌డిన వారు అనేక మందే ఉన్నారు. న‌వ మాసాలు మోసి..పెంచి పెద్ద చేసి వాడు ప్ర‌యోజ‌కుడు అయితే...అమ్మ‌కు అంత‌క‌న్నా ఆనంద‌మేముంటుంది. అందుకే పెళ్లైన ప్ర‌తి అమ్మాయి త‌ల్లీ కావాల‌ని...పుట్టిన బిడ్డ‌తో ఆడుకోవాల‌ని ఆదేవున్ని వేడుకోవ‌డం స‌హ‌జం. 

fake mother

అందుకే కాబోలు పెళ్లైనా..త‌ల్లీ కాలేక బిడ్డ కోసం దొంగైంది ఓమ‌హిళ‌. వ‌రుస‌గా రెండుసార్లు గ‌ర్భ స్రావం కావ‌డం. అత్తింట్లో సూటిపోటి మాట‌లు. ఒక్క బిడ్డ‌కైనా జ‌న్మ‌నివ్వ‌లేని నీ బ‌తుకెందుక‌నీ చీత్కారాలు. జీవితంలో ఒక్క‌సారైనా అమ్మ అని పిలుపించుకోవాల‌నే కోరిక‌.. దీంతో ఆమెను స‌మాజంలో దోషిగా నిల‌బెట్టాయి.  ఆమె దొంగ కాకున్నా...అమ్మ అనే పిలుపు కోసం ఆత‌ల్లీని దొంగ‌గా మార్చేశాయి ప‌రిస్థితులు. అందుకే రెండుసార్లు అబార్ష‌ణ్ అయినా అత్తారింట్లో చెప్ప‌లేదు. చెల్లెలు ఇంట్లోనే ఉంటాన‌ని చెప్పి...అక్క‌డికీ వెళ్ల‌కుండా చివ‌ర‌కు ప్ర‌భుత్వాసుప‌త్రి నుంచి బిడ్డ‌ను ఎత్తుకు వ‌చ్చి త‌న బిడ్డ‌గా ప‌రిచ‌యం చేసి...క‌ట‌క‌టాల‌పాలైంది. హృద‌య‌విదార‌క‌ర‌మైన ఈకేసును గురువారం హైద‌రాబాద్ పోలీసులు చేధించారు.

fake mother

సుల్తాన్ బ‌జార్ ప్ర‌సూతి ఆసుప‌త్రి నుంచి ఆరు  రోజుల చిన్నారి చేతన కిడ్నాప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే ఆమెను కిడ్నాప్ చేసింది స‌రూర్ న‌గ‌ర్ స‌మీపంలోని ఎన్టీఆర్ న‌గ‌ర్‌కు చెందిన నైనా రాణిగా పోలీసులు గుర్తించారు. ఆమెకు పిల్లలు పుట్టరనే ఉద్దేశంతోనే.. పెంచు కోవడానికే శిశువును ఎత్తుకుపోయినట్లు వెల్లడైంది. అయితే ఈకేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు...వారి ద‌ర్యాప్తులో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. బీదర్‌ ఖాసింపురకు చెందిన నైనా రాణి తండ్రి దర్జీ. తల్లి గృహిణి. ఇద్ద‌రు సోద‌రులు,  అయితే నైనాను నాలుగేళ్ల క్రితం బీదర్‌కే చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం జ‌రిపించారు.

fake mother

అయితే కొద్ది రోజుల‌కే అత‌డు చనిపోవడంతో మూడేళ్ల క్రితం జహీరాబాద్‌ వాసి సీమన్‌తో రెండో వివాహం చేశారు. ప్రస్తుతం సీమన్ పండ్ల వ్యాపారం చేస్తుండగా...నైనా గృహ‌ణిగా ఇంట్లో ఉంటోంది.  ఈనేప‌థ్యంలో ఆమెకు రెండుసార్లు అబార్ష‌న్ కావ‌డంతోనే...ఇక పిల్ల‌లు పుట్టార‌ని భావించింది. అయితే అత్తింటి వారి నుంచి పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని వేధింపులెక్కువ కావ‌డంతో...క‌వ‌ర్ చేసేందుకు నైనా స‌రికొత్త ఆలోచ‌న‌ను చేసింది. చాలా రోజుల నుంచి తాను  గర్భవతినని ప్ర‌చారం చేసుకుంది. భర్త సీమన్‌నూ నమ్మించింది. అయితే తాను ప్ర‌సవించే స‌మ‌యం వ‌చ్చింద‌ని తెలిసి ...నవజాత శిశువు కోసం శనివారం సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రికి వచ్చింది. అయితే సోమ‌వారం ఇద్ద‌రు చిన్నారుల్ని ఎత్తుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించింది. అయితే అప్పుడు వీలు కాక‌పోవ‌డంతో...చివ‌ర‌కు చేత‌న అనే బిడ్డ‌ను వాక్సినేషన్‌ పేరుతో కిడ్నాప్‌ చేసింది. త‌ర్వాత సోద‌రి ఇంటి వ‌ద్ద ప్రసవం జ‌రిగింద‌ని..ఆడ‌పిల్ల పుట్టింద‌ని కుటుంబీకుల‌కు చెప్పి...భ‌ర్త‌కూ ఫోన్ చేసింది. అయితే కుటుంబ స‌భ్యులు నైనా మాట‌లు న‌మ్మకుండా ఫేక్ అని తేల్చేయ‌డంతో అస‌లు క‌థ మొత్తం అడ్డం తిరిగింది. అయితే ఈనేప‌థ్యంలోనే మీడియాలో పాప కిడ్నాప్‌పై వార్త‌లు వ‌స్తుండ‌డంతో...స్థానికంగా ఉన్న బీద‌ర్ ఆసుప‌త్రిలో ఆబిడ్డ‌ను వ‌దిలేశారు. 

fake mother

అయితే పోలీసులు స్థానికంగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నైనా అత‌ని త‌మ్ముడిని గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేశారు. పాపం ఈమొత్తం ఎపీసోడ్‌లో నైనారాణి...త‌ల్లీ కావాల‌నే ఒక బ‌ల‌మైన కోరికే ఆమెను క‌ట‌క‌టాల పాలు చేసిన‌ట్లైంది. అమ్మ అని పిలుపించుకోవాల‌ని కోరిక తీర‌క‌ముందే ఉచ‌లు లెక్క‌పెడుతుండ‌డం విశేషం. 
 

tags: fake mother arrest,naina rani,fake mother,koti government hospital,sultan bazar government children hospital,koti,chetan,bidar,hyderbad police commissioner,hyderabad police commissioner anjani kumar yadav,

Related Post