సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీం

news02 Dec. 8, 2018, 7:53 a.m. general

supreme

తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 7 శాతం కలిపి 61 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఐతే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 50 శాతానికి లోబడే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని, సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్‌ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. 

supreme

తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, ప్రత్యేక జీపీ సంజీవ్‌కుమార్‌, న్యాయవాది ఉదయ్‌కుమార్‌సాగర్‌లు హాజరయ్యారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు కల్పించే రిజర్వేషన్‌ 50 శాతానికి మించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని సంగారెడ్డికి చెందిన స్వప్నారెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లు సవాల్‌ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ఎ.గోపాలరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జులై 9న ఉమ్మడి హైకోర్టు విచారణ జరిపింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించింది. 

tags: supreme, supreme court, supreme court on reservations, court on panchayat reservations

Related Post