హోటల్ రూంలో రహస్య కెమెరా

news02 Dec. 6, 2018, 9:57 p.m. general

room

అమెరికాలోని షికాగోకు చెందిన ఓ మహిళ బార్‌ పరీక్షల కోసమని గత 2015 జులైలో న్యూయార్క్‌ నగరానికి వెళ్లింది. అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌ లో రూమ్ తీసుకుంది. ఆ రూంలో ఆ మహిళ బాత్ రూంలో స్నానం చేస్తుండగా అక్కడ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలో రికార్డయ్యింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ వీడియోలో ఉన్నది మీరే కదా అంటూ అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను ఆ వ్యక్తి ఈ-మెయిల్‌లో ఆమెకు పంపాడు. దీని ద్వారా ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడి.. తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నఈ గ్రూపుకు సంబందించిన అన్ని హిల్టన్ హోటళ్లపై ఎకంగా 700 కోట్ల రూపాయలకు దావా వేసింది సదరు మహిళ.

tags: cam, secret cam in hotel room, lady pition about secret cam in hotel room, us lady case file about secret cam in hotel room, lady wants 700 crores against secret cam i hotel room

Related Post