నాకే పాపం తెలియదు

news02 April 20, 2019, 3:52 p.m. general

cji

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణ చేసింది. తనను గొగోయ్ లైంగికంగా వేధించారని ఆమె ఆరోపిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ 10న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గొగోయ్ తన చాంబర్ లో నా నడుము పట్టుకుని కౌగిలించుకున్నారని.. హత్తుకుంటూ శరీరమంతా తన చేతులతో తడిమారని చెప్పుకొచ్చింది. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని లేఖలో పేర్కొంది. తాను ఆయన నిర్బంధాన్ని వదిలించుకునేందుకు ఎంత  ప్రయత్నించినా ఆయన తనను వదల్లేదని చెప్పింది. అంతటితో ఆగకుండా నన్ను హత్తుకో అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారని సదరు 35 ఏళ్ల ఉద్యోగిని తన లేఖలో పేర్కొంది.

cji gogi

ఈ అంశాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్ గొగొయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటై ఆరోపణలపై విచారణ జరిపింది.ఈ సందర్బంగా తనపై మహిళ చేసిన ఆరోపణలను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఖండించారు. తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సదరు మహిళ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, ఇలాంటి చర్యలతో న్యాయవ్యవస్థ స్వతంత్రత పెను ప్రమాదంలో పడిందని గొగొయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని.. దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన గొగోయ్.. అయినా తాను ఎవరికీ భయపడనని.. అన్నారు. న్యాయమూర్తిగా 20ఏళ్ల పాటు నిస్వార్థమైన సేవ చేసిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 6 లక్షల 80 వేలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. 

tags: cji, cji ranjan gogi, sexual harrasment charges on cji gogoi, sexual harrasments charges on cji ranjan gogoi

Related Post