ప‌ద‌వి లేక‌పోతే పైస‌ల్ వాప‌స్‌..?

news02 July 10, 2018, 12:59 p.m. general

mpp bond

జ‌గిత్యాల‌: ఒక‌సారి ప‌ర‌మానంద‌య్య త‌న శిష్యుల‌ను పిలిచి సూది తీసుకురమ్మని చెబుతాడు. దీంతో గురువు గారి ఆదేశాల మేర‌కు శిష్యులంతా సూది కోసం బ‌జారుకు బ‌య‌లుదేరుతారు. అయితే సూది కొన్న వాళ్ల‌కు ఒక అనుమానం వ‌స్తుంది. ఉన్న 12 మంది శిష్యుల్లో ఎవ‌రు సూదిని తీసుకెళ్లి గురువుగారికివ్వాలి అనేది వారి డౌట్‌. దీంతో అందులో ఉన్న ఓతెలివైన శిష్యుడు త‌న తెలివినంతా ఉప‌యోగించి సూదిని ఒక  తాటిమొద్దుకు క‌ట్టి...ఆమొద్దును అంద‌రం క‌లిసి గురువు ప‌ర‌మానంద‌య్యకు అంద‌జేద్దామ‌ని సూచిస్తాడు. 

p

దీంతో వాని సూచ‌న మేర‌కు అదే మొద్దును తీసుకెళ్లి గురువుగారికిస్తారు. అయితే వీరి వాల‌కం చూసిన ప‌ర‌మానంద‌య్య సూది ఏదిరా నాయ‌నా అని అడుగితే...మొద్దుకు ఉంద‌ని చెబుతారు. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ప‌ర‌మానంద‌య్య ఓరి బ‌డుద్దాయిలు సూది కోసం ఎనుగులాంటీ తాటి మొద్దును మోసుకొని వ‌స్తారా..? అని ఆశ్చ‌ర్య‌పోతాడు. అయితే జ‌రిగిందేదో జ‌రిగింది కానీ, సూది ఇవ్వండ‌ని శిష్యుల‌ను ఆదేశిస్తాడు. అయితే మొద్దును జాగ్ర‌త్త‌గా తెచ్చిన శిష్యులు...గురువుకు కావాల్సిన సూదిని మాత్రం ఎక్క‌డో పారేస్తారు. దీంతో విష‌యం తెలిసిన గురువు దిక్కుమాలిన శిష్యులు ఎక్క‌డ దొరికారోన‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తాడు. 

p

అయితే ఈవిష‌యం ఇక్క‌డెందుకు ప్ర‌స్తావిస్తున్నారే క‌దా అని మీ డౌట్‌. అవును...ప‌ర‌మానందయ్య‌ శిష్యులంటే..బుద్ధిహీనులు. కానీ, ప్ర‌జ‌లెన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధులు చేసిన ప‌నికి అంత క‌న్నా...దారుణంగా న‌వ్వుకునే సంఘ‌ట‌న ఇప్పుడొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో దీనిపైనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 

jagityala

వివ‌రాల్లోకి వెళ్లితే...జ‌గిత్యాల జిల్లా కథలాపూర్‌కు చెందిన ఎంపీపీ తోట్ల న‌ర్సుపై ఇటీవ‌ల అవిశ్వాసం తీర్మానం పెట్టారు. ఆయ‌న‌ను ఆప‌ద‌వి నుంచి దించేందుకు మెజార్టీ ఎంపీటీసీ స‌భ్యులు ఒక్క‌ట‌య్యారు. అందులో భాగంగా ఆయ‌న‌కు అవిశ్వాస నోటీసులు కూడా అందించారు. అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్న...ఇక్క‌డే కొత్త ట్వీస్ట్ వెలుగులోకి రావ‌డం విశేషం. ఐదేళ్ల‌పాటు త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు బీజేపీ ఎంపీటీసీ గుండారపు సౌజన్యకు చాలా కాలం క్రిత‌మే డ‌బ్బులు ముట్ట‌జెప్పారు ఎంపీపీకి తొట్ల న‌ర్సు. ఆమె భ‌ర్త గంగాధర్‌కు 2014లోనే 4 లక్షల రూపాయాలు అంద‌జేశారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లైతే 20 ల‌క్ష‌ల రూపాయాలు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒప్పందం చేసుకున్నారు ఎంపీపీ. అంతేకాక ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఒప్పందాన్ని 20 రూపాయాల బాండ్ పేప‌ర్‌పై అగ్రిమెంట్ కూడా చేసుకోవ‌డం విశేషం.

mpp agriment

అయితే ఇప్పుడు తాజాగా ఎంపీపీపై స‌భ్యులు అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్ట‌డంతో...సౌజ‌న్య ఎంపీపీ తొట్ల న‌ర్సుకు వ్య‌తిరేకంగా ప్లేట్ ఫిరాయించింది. ఎంపీపీకి వ్య‌తిరేకంగా అవిశ్వాసం ప్ర‌క‌టించిన స‌భ్యుల‌తో క‌లిసిపోయి నోటీసుల‌పై సంత‌కం చేసింది. దీంతో సౌజ‌న్య వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఎంపీపీ...అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఎంపీటీసీ సౌజ‌న్య అగ్రిమెంట్ బాండ్‌పై పెట్టిన సంత‌కంతో కూడిన కాపీని విడుద‌ల చేశారు. అయితే ఈవిష‌యం కాస్తా ఇప్పుడు విశేష ప్ర‌చుర్యం పొంద‌డంతో...వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంపై స్థానికులు ముక్కున వేలేకుంటున్నారు. మామూలుగా సివిల్,  ప్రామిస‌రీ అగ్రిమెంట్లు విన్నాం కానీ, కొత్త‌గా ప‌ద‌వుల‌ను కాపాడుకునేందుకు అగ్రిమెంట్ ఎంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈఅగ్రిమెంట్‌ను ఏకోర్టులో వేసి ఎంపీపీ త‌న హ‌క్కుల‌ను సాధించుకుంటాడోన‌ని చెప్పాల‌ని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే వీరు ప‌ర‌మానంద‌య్య శిష్యుల‌నే మించిపోయార‌ని సెటైర్లు వేస్తున్నారు.

tags: mpp post ku bond,

Related Post