తెలంగాణలో ట్రంప్ కు పూజలు..

news02 June 22, 2018, 9:43 a.m. general

trump

అమెరికా-తెలంగాణ (ఇంటర్నేషనల్ డెస్క్)- అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పూజలు.. అది కూడా మన తెలంగాణలో.. ట్రంప్ కు తెలంగాణలో పూజలేంటి అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు వీరాభిమాని. ఈ అభిమానం ట్రంప్ అధ్యక్షుడు కాకుముందు నుంచి ఉందట కృష్ణకు.  ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లక్రితం డబ్ల్యూడబ్ల్యూఈ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు.  అదిగో ఆ కార్యక్రమం చూసినప్పటి నుంచి ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నాడట కృష్ణ. 

trump

ఈ కార్యక్రమంలో ట్రంప్ చాలా ఉత్సాహంగా పాల్గొనేవారనీ.. అప్పటి నుంచే ట్రంప్‌ అభిమానిగా మారానని చెబుతున్నాడు. ట్రంప్‌ లోని ముక్కుసూటితనం, చురుకుదనం తనకెంతగానో నచ్చుతాయనీ, ఆయన హావభావాలు తనలో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతాయని అంటున్నాడు కృష్ణ. ఇక ట్రంప్ ను ఆరాధ్య దైవంగా పూజించే స్థాయికి కృష్ణ అభిమానం వెళ్లింది. చాలా కాలంగా తన ఇంట్లో ట్రంప్‌ చిత్రపటాన్ని పూజిస్తున్నాడు. అంతే కాదు తన చేతి వేలు కోసుకొని రక్తతర్పణం చేసే వరకు వెళ్లింది అభిమానం. ఇక కృష్ణ తన ఫేస్‌బుక్‌ పేజీలో ట్రంప్‌ కోసం చేస్తున్న పూజలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్‌ చేశాడు. వీటిని అతని ఫ్రెండ్స్ ట్విటర్‌ లో పోస్ట్ చేయడంతో తనను ఆరాధిస్తున్న కృష్ణ గురించి తెలుసుకున్న ట్రంప్‌ ఈ నెల 19న ట్విటర్‌ ద్వారా స్పందించారు. కోట్ల మంది భారతీయుల్లో కృష్ణను తన ఆప్తమిత్రుడిగా భావిస్తున్నాననీ, త్వరలోనే కలుద్దామని చెప్పారు.

tags: trump, us president, us president trump, trump coming telangana, trump coming to telangana, trump coming to janagama,

Related Post