కాలి బూడిదైన 300 స్టాళ్లు

news02 Jan. 31, 2019, 7:42 a.m. general

numaish

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ లోని నుమాయిష్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో ఎగ్జిబిషన్ లోని ఓ స్టాల్లో చిన్నగా మొదలైన మంటలు ఇతర స్టాల్స్ కు అంటుకున్నాయి. ఎగ్జిబిషన్ లోని చాలా వరకు స్టాళన్నీ ప్లాస్టిక్‌, కర్రలు, తదితర వస్తువులతో ఉండటం.. దుకాణాల్లో దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువులు వంటివి ఎక్కువగా ఉండటంతో క్షణాల్లోనే మంటలు దావాణంలా అంటుకున్నాయి. స్టాల్స్ అన్నీ పక్కపక్కనే ఆనుకుని ఉండటంతో మంటలు వెంటనే విస్తరించాయి. ఫైర్ ఇంజిన్ లు వచ్చేలోపే దాదాపు వంద స్టాల్స్ కు నిప్పంటుకుందని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. 

fire

రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని మహేశ్‌ బ్యాంక్‌ స్టాల్‌లో విద్యుదాఘాతం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై మంటలను ఆర్పేసే లోపే పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంక్‌ స్టాల్‌కు వ్యాపించాయి. దీంతో పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఒక్కొక్కటిగా పాకుతూ మంటలు స్టాళ్లను చుట్టుముట్టాయి. దీంతో సందర్శకులను వివిధ మార్గాల ద్వార  బయటకు పంపించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దాదాపు 40 నుంచి 50 వేల మంది సందర్శకులున్నారని అధికారులు చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు 45 నుంచి 50 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరగవచ్చని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. 

tags: fire, fire accident, fire accident in exhibition grounds, fire accident in numaish, fire accident in nampally exhibition grounds

Related Post