హఠాత్తుగా ఇరాక్ కు

news02 Dec. 28, 2018, 9:30 a.m. general

trump

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాక్‌లో పనిచేస్తున్న సైనికులను సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. క్రిస్మస్‌ పండగ రోజు అర్ధరాత్రి ఆయన హఠాత్తుగా ఇరాక్‌ వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది అమెరికా సైనికులకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ అనుకోని విజిట్ లో ట్రంప్‌ వెంట ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌, జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ఇరాక్‌ చేరుకొన్నారు. 

trump

బాగ్దాద్‌ పశ్చిమ భాగంలోని అల్‌ అసద్‌ ఎయిర్‌ బేస్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండ్‌ అయింది. ఈ బేస్ లోని రెస్టారెంట్‌లో ట్రంప్‌ తన సైనికాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ట్రంప్ రెస్టారెంట్‌ లోని డైనింగ్‌ హాల్లోకి అడుగుపెట్టగానే సైనికులంతా నిలబడి అభివాదం చేశారు. ఆ తరువాత సైనికులతో ఆయన సరదాగా గడిపారు. చాలా మంది సైనికులు ట్రంప్ తో సెల్ఫీలు దిగి ఆటో గ్రాఫ్‌లు తీసుకొన్నారు.

tags: trump, trump iraq visit, trump iraq tour, trump iraq surprise visit, trump selfie with army

Related Post