10 మంది స‌జీవ ద‌హ‌నం

news02 July 5, 2018, 10:44 a.m. general

wgl vishadam
వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. బుధ‌వారం బాణ‌సంచా గోదాంలో పేలుళ్లు సంభ‌వించ‌డంతో తీవ్ర విషాదం నెల‌కొంది.  పేలుళ్ల దాటికి మృత‌దేహాలు తునాతున‌క‌లైపోయాయి. మృతుల శ‌రీర భాగాలు మొత్తం మాంసం ముద్ద‌లుగా మారిపోయాయి. కీర్తినగర్‌ కోటిలింగాల ఆలయం సమీపంలోని భద్రకాళి బాణసంచా గోదాంలో సంభ‌వించిన ఈప్ర‌మాదంతో...న‌గ‌రంలో భీతావాహ‌ ప‌రిస్థితి నెల‌కొంది.

wgl vishadam

దాదాపు ఉద‌యం 11.15-11.30 గంట‌ల స‌మ‌యంలో ఈప్ర‌మ‌దం సంభవించిన‌ట్లు స‌మాచారం. 11 గంటల ప్రాంతంలో ఓ వాహనంలో బందల సారంగపాణి, బత్తుల రవి అనే ఇద్దరు వ్యక్తులు మరో ఇద్దరితో కలిసి బాంబులు కొనుగోలు చేసేందుకు గోదాంకు వ‌చ్చారు. వీరిలో ముగ్గురు లోప‌లికి వెళ్లార‌ని...అందులో ఒకరు సిగరెట్‌ కాల్చడంతోనే ఈప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం విద్యుదాఘాత‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని అంటున్నారు. ఇక అధికారులు మాత్రం ఈసంఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటీ క్లారిటీ ఇవ్వ‌లేదు. 

wgl vishada

అయితే ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు అందులో కార్మికుల‌తో పాటు మొత్తం 13 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది కార్మికులు పేలుళ్ల‌దాటికి సజీవ ద‌హ‌నం అయిపోయారు. అయితే ప్రమాదం జరిగిన 5 నిముషాల్లోనే స్థానిక యువకులు ధైర్యం చేసి లోప‌ల ఉన్న ప‌లువురి ప్రాణాలు కాపాడారు. త‌ర్వాత అర‌గంట స‌మ‌యానికి అక్క‌డికి అగ్ని మాప‌క సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ను అదుపులోకి తేవ‌డంతో...ప‌రిస్థితి కొంత స‌ద్దుమ‌ణిగింది. పేలుళ్ల దాటికి చెల్లాచెదురైన మృత‌దేహాలు, గాయ‌ప‌డిన క్ష‌త‌గాత్రుల‌ను చూసి స్థానికులు క‌న్నీరు మున్నీరైయ్యారు. మృత దేహాలు ముక్క‌లు ముక్క‌లు కావ‌డం వారిని తీవ్రంగా క‌ల‌చివేసింది. 

wgl vishadam

పేలుళ్లు ఘ‌ట‌న‌పై ప‌లువురు తీవ్ర దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇక వ‌రంగ‌ల్ ఘ‌ట‌న తీవ్రంగా బాధించింద‌ని...మృతుల కుటుంబీకుల‌కు 5 ల‌క్ష‌ల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న‌ట్లు మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా ఈఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబీకుల‌కు మ‌రింత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని సూచించారు.

tags: warangal explosition,Explosionscracker,manufacturing,unitKcrkilled,badrakali temple,tapasulu,warangal,fire officials,cm kcr,pcc uttam,kadiyam srihari,dipavali,divali,killa warangal,5 lakshs, dead bodies,accident,warangal incident,

Related Post