ఛీ..మ‌నిషి ప్రాణంకు లెక్కేలేదా.?

news02 Feb. 26, 2019, 10:47 p.m. general

/bull_fights_on_road_2

గుజ‌రాత్ : మ‌నిషి ప్రాణం ఎంతో విలువైంది.. భూ మండ‌లంలోని జీవ రాసుల్లో మ‌నిషే గొప్పోడు.. ఇది ప్రతి ఒక్క‌రు చెప్పే మాట‌. కాని మ‌నిషి ప్రాణం కంటే.. మ‌నిషే గొప్ప‌నా.. అవును గొప్పే అంటున్నారు గుజరాత్ పోలీసులు. అదేంటీ అనుకుంటున్నారా..? అయితే వివ‌రాల్లోకి వెలితే.. అహ్మదాబాద్‌కు దగ్గర్లోని కాజోల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సంజ‌య్ ప‌టేల్ కు 28 సంవ‌త్స‌రాలు. ఓ కార్ షో రూంలో ప‌నిచేసే సంజ‌య్ .. డ్యూటి ముగించుకుని బైక్ పై ఇంటికి  వెళుతుండ‌గా.. హ‌టాత్తుగా రోడ‌డ్ఉపైకి వ‌చ్చిన‌రెండు ఆవులు.. సంజ‌య్ బైక్ ను డీ కొట్టాయి. అంతే సంజ‌య్ రోడ్డుపైకి ప‌డిపోవ‌డంతో.. త‌ల‌కు తీవ్ర‌గాయమై అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. పేళ్లై ఏడాది కూడా కాక‌ముందే కొడుకు చ‌నిపోవడంతో.. సంజ‌య్ తండ్రి తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. దీనికి కార‌ణ‌మైన ఆ ప‌శువుల య‌జ‌మానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేస‌న్ ల చుట్టూ ఎంత తిరిగినా.. పిర్యాదు తీసుకునే వారే క‌రువ‌య్యారు. అంతేకాదు..  అదేమంటే.. రోడ్డుపైకి  వ‌చ్చిన పశువుల‌ది త‌ప్పు కాదు.. బైక్ పై వ‌స్తున్న మీ కోడుకుదే త‌ప్పంటు సెల‌విచ్చార‌ట‌. దీంతో.. అయ‌న కోర్టుకు వెళితే కూడా ఇదే స‌మాదానం రావ‌డంతో.. ఏదేమి న్యాయం రా భ‌గ‌వంతుడా..! అంటు కుమిలిపోతున్నారు. సో.. మ‌న‌కు నిత్యం రోడ్డుపై ప‌శువులు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.. కాబట్టి కాస్త జాగ్ర‌త్త‌.!!

tags: gujarath, police, ahmadabad hycourt, bull fight, road, sanjay, died, race draiving,

Related Post