బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు..?

news02 April 16, 2018, 9:57 p.m. general

Makka majid bomb blast

హైదరాబాద్ : అది మే 18, 2017 సంవత్సరం. భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మిట్ట మధ్యాహ్నం 1.30. అందమైన చార్మినార్ చూసేందుకు ఎప్పటిలాగే టూరిస్టులు తిరుగుతున్నారు. అది శుక్రవారం కాబట్టి చార్మినార్ పరిసరాలన్నీ అత్తరు వాసన తో నిండిపోయాయి. మరో వైపు చార్మినార్ పక్కనే వుండే మక్కా మజీద్ నుంచి అల్లా హో అక్బర్ అంటూ మైక్ లో హజ్ వస్తోంది. ఎవరూ ఊహించలేదు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలియదు. మక్కా మజీద్ నుంచి తెల్ల బట్టలతో అల్లకు ప్రార్థన చేస్తున్న ముస్లిం సోదరులు బయటకు పరుగులు పెట్టారు. అక్కడ బాంబ్ పేలింది. అంత ప్రశాంత మైన వాతావరణం అంతా గందరగోళంగా మారింది. కొందరి శరీర భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. మరి కొందరు అవయవాలు తెగిపడి రక్తం మడుగులో పడి కొట్టుకుంటున్నారు. మొత్తానికి 9 గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 58 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఇంత భయానక వాతావరణానికి కారణమైన ఈ కేసు పై ఎన్ఐఎన్ కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఎవరూ దోషులుగా పట్టుపడలేదు. కారణం సాక్షాలు లేకపోవటం.

Makkamajid bomb blast

ఈ కేసు దర్యాప్తులో ముఖ్యమైన ఘట్టాలు

మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు చోటు చేసుకొని 9 మంది మృతి చెందారు. 58 మంది గాయపడ్డారు

జూన్ 2010: ఈ కేసులో సీబీఐ నిందితుల ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు ఉంది.

29 డిసెంబర్ 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అతను చనిపోయాడు.

నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది.

డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు.

2011 డిసెంబర్ 3: గుజరాత్‌ వల్సాద్‌కు చెందిన భారత్‌ మోహన్‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌భాయి అరెస్ట్.

ఏప్రిల్ 2011: ఈ కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ - నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బదలీ అయింది.

2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌ పోలీసులకు చిక్కాడు.

మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసీమానందకు బెయిల్ ఇచ్చింది. ఏడేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు.

మార్చి 31, 2017: అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు

ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దీంతో ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేశారు.

ఇప్పుడు మక్కా బాంబ్ బ్లాస్ట్ కేసు మొదటికొచ్చింది. అసలు దోషులెవరు. అందరూ నిర్దోషులైతే బాంబ్ పెట్టింది ఎవరు.. ఇంతమంది ప్రాణాలు తీసింది ఎవరు. ఇంత మంది భవిష్యత్ ని చీకటి చేసింది ఎవరు. 11 ఏళ్ల తర్వాత నిందితులంతా నిర్దోషులుగా తేలితే అసలు దోషులను ఎవరు పట్టుకుంటారు. అసలు దోషులు ఎవరు.

Related Post