ప్ర‌పంచ సంప‌న్నుల్లో పంతంజ‌లి బాల‌కృష్ణ ..!

news02 March 7, 2019, 1:21 p.m. general

PATANJALI BALAKRISHNA BABA

డిల్లీ : బాబా రాందేవ్ యోగాసనా ల ద్వారానే ఫేమస్ అయ్యారని అందరికీ తెలుసు. యోగాసనాల తర్వాత పతంజలి పేరుతో వివిధ భారతీయ ఉత్పత్తులను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. మొన్నామధ్య జీన్స్, సిమ్ కార్డులు కూడా తెచ్చేశారు. ఇతర విదేశీ కంపెనీలకు పోటీగా పతంజలి బ్రాండ్ మార్కెట్లో దూసుకుపోతోంది. పతంజలి ఉత్పత్తులకు ముందు బాబా రాందేవ్ క‌న‌బ‌డినా .. తెర‌వెనుక బాబా బాల‌కృష్ణ ఉన్నారు. ప‌తాంజ‌లి ఉత్ప‌త్తుల ద్వారా ఆయ‌న రాబ‌డి విప‌రీతంగా పెరిగింది. దీంతో బాబా బాలకృష్ణ ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్నారు. 2018 లో ఆయన ఎంత సంపాదించారో తెలుసా ..? ప్రపంచంలో సంపన్నుల జాబితా తయారు చేసే ఫోర్బ్స్ కూడా బాబా బాలకృష్ణ సంపాదనకు నోరెళ్ళబెట్టింది. ఫోర్బ్స్ జాబితాలో భారత్‌ సంపాదనాపరులలో 15వ వాడిగా నిలిచాడు పతంజలి బాలకృష్ణ. బాబా రామ్‌దేవ్ తో కలిసి స్థాపించిన ఈ పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ 98.6 శాతం వరకూ వాటాలు బాబా బాలకృష్ణ పేరు మీదనే ఉన్నాయి. 

patanjali balakrishna baba

పతంజలి ఉత్పత్తులు సంవత్సరానికి 1.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయంటే ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యనే మార్కెట్‌ పెంచుకునేందుకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది పతంజలి. రానున్న రోజులలో పతంజలి మరింత వేగంగా  దూసుకుపోవడం ఖాయమని చెప్తున్నారు విశ్లేషకులు. ముప్ఫయ్యేళ్లుగా రామ్‌దేవ్‌కి సన్నిహితుడిగా ఉంటున్న బాలకృష్ణకి ఆయుర్వేద విద్యలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. కాలక్రమంలో మరుగునపడిన ఎన్నో ఆయుర్వేద సూత్రాలను ఆయన వెలికి తీసి వాటి ఆధారంగా తిరిగి ఆ ఔషధాలను తయారు చేశారన్న పేరుంది. తొలిదశలో సంస్థ తీసుకొచ్చిన ఔషధాలూ, ఉత్పత్తులన్నీ ఆయన సృష్టే. ప్రచారం చేసేది రామ్‌దేవ్‌ అయినా దాని వెనకుండే వ్యూహకర్త బాలకృష్ణే. 

patanjali balakrishna baba

tags: PATANJALI PRODUCTS,PATANJALI,PATANJALI HONY,PATANJALI SHAMPO,PATANJALI JEANS,PATANJALI SIM CARDS,PATANJALI BALAKRISHNA,PATANJALI RAMDEV BABA,PATANJALI KALAKRISHNA BABA

Related Post