టీవీ చూస్తే మగవాళ్లకు అంత ప్రమాదమా?

news02 March 13, 2018, 7:55 p.m. general

అదేపనిగా టీవీ ముందు కూర్చుంటే.. ఏ కంటి జబ్బులో.. తలనొప్పులో వస్తాయని విన్నాం.. కానీ ఇదేం.. ? విచిత్రం.. టీవీ ముందు గంటల తరబడి కూర్చునే మగవారికి క్యాన్సర్ రావడమేంటి? రోజులో 4 గంటలకు పైగా టీవీ ముందు కూర్చునే మగవారికి క్యాన్సర్ ముప్పు అధికమని ఓ అధ్యయనం చెబుతోంది. 5 లక్షల మంది ఆడవారు, మగవారిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేలిందట.. ఎక్కువ టైం టీవీ చూసిన మగవారిలో చాలామందికి ఆరేళ్ల తరువాత పెద్దపేగు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందట.

ఫ్రాన్స్ కి  చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆఫ్ క్యాన్సర్, బ్రిటన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఈ విషయంపై అధ్యయనం చేసినట్లు సమాచారం. శరీర శ్రమ పెరిగే కొద్దీ మగవారిలో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట.. గంటల తరబడి ఒకే చోట కూర్చువడం వల్ల బరువు పెరిగే ముప్పు ఉంది. ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. అధిక కొవ్వు హార్మోన్ల స్ధాయిపై ప్రభావం చూపుతుంది. ఇది కణాల పెరుగుదలపై ప్రభావితం చేసి పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సో .. టీవీ చూడటం వల్ల క్యాన్సర్ రాదు.. ఏ పనీ లేకుండా గంటల తరబడి టీవీకి అతుక్కుని కూర్చుంటే శరీర శ్రమ లేక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నది ఈ అధ్యయనం సారాంశం.  సో బీ .. కేర్ ఫుల్

 

tags: cancer, men, watchihng, television, research

Related Post