ఆషిఫా కుటుంభం ధీన‌గాధ‌

news02 April 14, 2018, 7:50 p.m. general

Ashifa family

జ‌మ్ము కాశ్మీర్ లో ఎనిమిది రోజుల పాటు దుండ‌గుల చేతిలో లైంగిక‌దాడికి గురై ప్రాణాలు వ‌దిలిన 8 యేళ్ళ చిన్నారి ఆసిఫా సంఘ‌ట‌న దేశాన్ని క‌దిలిస్తోంది. అభం శుభం తెలియ‌ని చిన్నారిపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఈ సంఘ‌ట‌న ప్ర‌జ‌లంద‌రు ఖండిస్తున్నారు. అయితే ఈ చిన్నారి ఆసిఫా కుటుంభం బ్యాక్ గ్రౌండ్ చాలా బాధాక‌రంగా ఉంది.

rape and murderd child Ashifa parents

జమ్ము కశ్మీర్‌లోని కథువాలో లో చిన్నారి ఆసిఫా కుటుంబం నివాసం ఉంటుంది. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి క‌త్వా జిల్లాలోని ర‌సానా అనే  చిన్నగ్రామంలో ఉంటుంది. ఊరి చివ‌ర‌న ఉన్న రెండు గ‌దుల పాత ఇళ్ళు వీళ్ళ‌ది. ఈస్ట్ జ‌మ్మునుంచి 72 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఆసిఫా పూర్తి పేరు ఆసిఫా బానో .. తండ్రి మ‌హ‌మ్మ‌ద్ యూసూఫ్‌, తల్లి న‌సీమా. వీళ్ళ కుటుంబం క‌డు పేద‌రికంలో ఉంది. గ్రామంలోనే ఉంటూ వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటూ బ‌తుకు ఎల్ల‌దీస్తున్నారు. ఆసిఫా ఈ కుటుంభంలో మూడో సంతానం.. ఈ చిన్నారి తండ్రి కి 52 యేళ్ళుంటాయి.

Raped 8 years girl Ashifa House

ఆషిఫా కు ఇద్ద‌రు అక్క‌లు.. అయితే ఈ కుటుంబం దుర‌దుష్టం కొద్దీ ఆషిఫా క‌న్నా పెద్ద వాళ్ల‌యిన ఇద్ద‌రు బిడ్డలు రెండేళ్ళ క్రితం జ‌రిగిన ఒక రోడ్డు ప్ర‌మాదంలో క‌న్ను మూశారు. అప్ప‌టినుంచి చ‌నిపోయిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను ఈ దంప‌తులు ఆషిఫా లోనే చూసుకుంటూ బ్ర‌తుకు వెళ్ళ‌దీస్తున్నారు.

8 Years old Girl Ashifa Raped

ఆషిఫా త‌ప్పిపోయిన‌ప్ప‌టినుంచి ఆమె త‌ల్లి దండ్రులు  వెత‌క‌ని చోటు లేద‌ట‌. అగాయిత్యానికి పాల్ప‌డిన గుడి పూజారి సాంజీ రామ్ ను చిన్నారి త‌ప్పిపోయిన రోజే అడిగిన‌ట్లు ఆషిఫా అమ్మ మీడియాకు తెలిపింది. త‌ప్ప‌కుండా మీ కూతురు తిరిగి వ‌స్తుంద‌ని ఆయ‌న స‌మాధానం చెప్పిన‌ట్లు చెప్పింది. ఇప్ప‌టికీ త‌మ కూతురు ఆషిఫా త‌మ ఇంటి ముందు ఆడుకుంటున్న‌ట్లు త‌మ‌కు క‌నిపిసస్తోంద‌ని క‌న్నీళ్ళ ప‌ర్యాంతం అవుతున్నారు ఆషిఫా త‌ల్లిదండ్రులు.  

Raped girl Ashifa village

ఆ గ్రామ ప్ర‌జ‌లంతా అషిఫా కుటేంభానికి మ‌ద్ద‌తుగా నిర‌హ‌ర దీక్ష చేస్తున్నారు. దేశం అంతా అట్టుడుకుతోంది. కాని అగ్ర‌కులస్తుల భ‌యంతో ఆషిఫా త‌ల్లిదండ్రులు గ్రామాన్ని వ‌దిలి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి వెళ్ళారు. ఒక వైపు కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్నా.. దేశ ప్ర‌జ‌లంతా ఆ కుటుంభానికి న్యాయం చేయాల‌ని ఆందోళ‌న చేస్తున్నా ఆ కుటుంభం మాత్రం బిక్కుబిక్కుమొంటూ ఎక్క‌డో త‌ల‌దాచుకున్నారు.

 

Related Post