వరదలు దాటి పెళ్లి చేసుకున్న యువతి

news02 Aug. 19, 2018, 7:31 p.m. general

Bride dare in Kerala fluda

హైదరాబాద్ : తన పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని కలలుకన్న కేరళ యువతికి వరదలు నిరుత్సాహ పర్చాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరదలతో తన పెళ్లి ఆగిపోతుందని తల్లడిల్లింది. కానీ ఎవరు వూహించని సాహసంతో వరదలను అధిగమించి పెళ్లి చేసుకుంది యువతి. తమిళనాడులోని తెంగుమరహడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి రాసత్తి, సిరుముగయ్ ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ కు.. ఈనెల వివాహం నిశ్చయమైంది. 

వివాహవేదిక దగ్గరకు చేరాలంటే రాసత్తి కుటుంబం మోయర్ నది దాటాలి. నదిపై వంతెన లేకపోవడంతో పడవల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత వర్షాల వల్ల అధికారులు రాకపోకలను బంద్ చేయించారు. రాసత్తి కుటుంబం అధికారులను కలిసి తమ సమస్యను తెలిపారు. ప్రత్యేక అనుమతి తీసుకున్నారు.అధికారులు అంగీకరించడంతో తెప్పల్లో పదిమంది కుటుంబ సభ్యులు నదిని క్షేమంగా దాటారు. పెళ్లి కోసం అనుమతి ఇవ్వడంతో రాసత్తి ఆనందం వ్యక్తం చేసింది. తమ గ్రామానికి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు

tags: Kerala fluds, Kerala helping, bride dare in Kerala fluds, Telangana cm kcr helps to Kerala, cm Chandrababu announced amount to Kerala, Kerala cm ponarai, pm modi areal survey, Kerala sunami, Kerala all for Kerala, Kerala tourism, Kerala kutties

Related Post