అమ్మంటే ప్రేమకు రూపం..

news02 Nov. 12, 2018, 9:51 p.m. general

baby

ప్రపంచంలో జాతి, మతం, కులం ఇలా ఏదైనా సరే.. అమ్మ ప్రేమ మాత్రం అక్కడైనా ఒక్కటే. ఈ మాట చాలా సార్లు.. చాలా సందర్బాల్లో నిరూపితమైంది. అమ్మ ప్రేమ మరి దేనికి సాటి రాదని.. అమ్మ ప్రేమ ఎవరిలోనైనా ఒక్కటేనని మరోసారి రుజువైంది. ఫ్లైట్ లో ఓ చిన్నారి పాలు లేక ఏడుస్తోంటే.. అంటెండెెెంట్ స్వయంగా పాలివ్వడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పిలిప్సిన్స్ లో ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్నారి పాప ఏడవటం మొదలుపెట్టింది. ఆ పాప తల్లి దగ్గర పట్టడానికి పాలు లేవు.. ఆ సమయంలో విమానంలోను పాలు లేవట. 

baby

చిన్నారి పాప ఏడుపు చూడలేక కన్నతల్లి బోరున ఏడ్చేసిందట. దీంతో ఇదంతా గమనించిన ఎయిర్ హోస్టెస్ పాత్రికా ఆర్గానో తన తల్లి మనసును చాటుకుంది. ఆ పాపకు తానే స్వయంగా చన చనుపాలిచ్చింది. ఇంకేముంది పాలు తాగిన వెంటనే ఆకలి తీరిన చిన్న పాప హాయిగా నిద్రపోయింది. పాపకు పాలిచ్చిన ఎయిర్ హోస్టెస్ ను అంతా మెచ్చుకున్నారు. ఎంతైనా తల్లి మనసు తల్లి మనసే కదా. 

tags: baby, air hostes given breast feeding, air hostes given breast feeding to baby, air hostes patrika argano

Related Post