జూలి వెనుక ఎవరున్నారు..

news02 May 15, 2018, 2:21 p.m. general

julia

చెన్నై (నేషనల్ డెస్క్)- జల్లికట్టు జూలి.. గతంలో తమిళనాడులో జల్లికట్టుకు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమ్మాయి. జల్లికట్టు ఆందోళనలో పాల్గొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో చెన్నై మెరిీనా బీచ్ లో జల్లికట్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. చిన్నమ్మ.. చిన్నమ్మ.. ఓపీఎస్‌ ఎంగేమ్మ (చిన్నమ్మ.. చిన్నమ్మ, ఓపీఎస్‌ ఎక్కడమ్మా) అంటూ నినాదాలు చేసి అందరి దృష్టిలో పడింది. అటు రాజకీయ వర్గాల్లోను.. ఇటు సినీ వర్గాల్లోను జూలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

jallikattu julia

ఆతరువాత కొన్నాళ్లు కనిపించకుండా పోయిన జూలి హాఠాత్తుగా బిగ్‌ బాస్‌ కార్యక్రమం ద్వారా మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యింది. ఈ కార్యక్రమంతో మరోసారి పాపులర్ అయ్యింది జూలి. ప్రస్తుతం ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌ లో వ్యాఖ్యాతగా పనిచేస్తూ, టీవీ సీరియళ్లలోనూ నటిస్తోంది. నీట్‌ లో ఉత్తీర్ణత సాధించని కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని అనిత  జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న సినిమాలో జూలి ప్రధాన పాత్రలో నటిస్తోందట.

julia hot

ఇప్పుడు మల్లీ తెరపైకి వచ్చిన జూలి.. ఎన్నో వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తానని, రాజకీయ రంగంలో కలుసుకుందామంటూ స్టెట్ మెంట్ ఇచ్చింది. దీంతో జూలి వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. జయలలిత మరణానంతరం రాష్ట్రంలోని రాజకీయ శూన్యత భర్తీచేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ప్రారంభమైన నేపథ్యంలో జూలి ప్రకటన సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. 

tags: julia, jallikattu, jallikattu julia, tv actress julia

Related Post