ప్రభుత్వ ప్రకటనల్లో తప్పిదం

news02 Aug. 14, 2018, 3:25 p.m. general

govt

హైదరాబాద్- ప్రభుత్వం తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఎన్నో ప్రకటనలు చేస్తుంది. ప్రధానంగా పత్రికల్లోను, టీవీ చానల్స్ లోను విరివిగా పలు రకాల ప్రకటనలు జారీ చేస్తుంది సర్కార్. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రెండు వేర్వేరు ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు విషయం ఏంటంటే.. రైతు భీమ, కంటి వెలుగు పధకాలకు సంబందించి తెలంగాణ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలు పరిశీలిస్తే.. ప్రకటనలోని మహిళ.. పిల్లవాడు ఒక్కరే కాని.. ఆమె పక్కన నిల్చున్న భర్త మాత్రం వేరు. 

రైతు బంధు పధకం ప్రకటనలో భార్య, పసిపాప పక్కన భర్త స్థానంలో ఓ వ్యక్తి ఉండగా.. కంటి వెలుగు పధకానికి సంబందించిన ప్రకటనలో అదే మహిళ, పసిపాప పక్కన వేరే వ్యక్తి భర్త స్థానంలో ఉన్నారు. అంటే ఒకే మహిళకు రెండు వేర్వేరు ప్రకటనల్లో ఇద్దరు వేర్వేరు భర్తలు ఉన్నట్లుగా ఈ ప్రకటనలు చెప్పకనే చెబుతున్నాయి. దీంతో ఈ ప్రకటనలు చూసినవారంతా.. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా ప్రకటనలు ఇవ్వడం ద్వార తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.

tags: govt add, govt advertisement, ts govt add, govt advertisement, telangana govt add, telangana govt advertisement

Related Post