తాజ్ మహల్ మాకు చెందిందే..

news02 April 12, 2018, 6:09 a.m. general

tajmahal case in supreme court

న్యూడిల్లీ-ఆగ్రా- ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన అద్బుత కట్టడం తాజ్‌ మహల్‌ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డు  వాదించగా.. అయితే షాజహాన్‌ సంతకాలు చూపించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా భారత పురావస్తు శాఖ 2010లో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. తాజ్‌మహల్‌ ను నిర్మించిన షాజహాన్‌ దాన్ని వక్ఫ్‌ బోర్డు ఆస్తిగా ప్రకటించారని వక్ఫ్‌ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు షాజహాన్‌ సంతకాలు చేసిన పత్రాలు సమర్పించండి అని కోర్టు వక్ఫ్‌ బోర్డును ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ పత్రాలు సమర్పించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ఇక మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ కోసం తాజా మహల్ ను 1648వ సంవత్సరంలో నిర్మించారు. అయితే షాజహాన్‌ దీన్ని నిర్మించిన 18ఏళ్ల తర్వాత 1666లో మరణించారు.  2005లో వక్ఫ్‌ బోర్డు తాజ్‌ మహల్ తమ ఆస్తిగా వెల్లడించింది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తు శాఖ 2010లో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తాజ్‌ మహల్‌ వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది అంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారని వ్యాఖ్యానించిన కోర్టు.. ఇలాంటి విషయాలతో సుప్రీంకోర్టు సమయాన్ని వృథా చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజ్‌ మహల్ మీదే అయితే షాజహాన్‌ సంతకం చేసిన ఒరిజినల్‌ డీడ్‌ చూపించండి అని వక్ఫ్ బోర్డ్ ను ఆదేశించింది.

అంతే కాదు మొగల్ చక్రవర్తి షాజహాన్‌ జీవత చివరాంకంలో ఆయనను అతని కుమారుడు ఔరంగజేబు ఆగ్రా కోటలో గృహనిర్బంధంలో ఉంచాడుని గుర్తు చేసిన కోర్టు... మీకు వక్ఫ్‌ నామాపై సంతకం ఎలా చేశారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసలు ఆ కాలంలో వక్ఫ్‌నామానే లేదని పురావస్తు శాఖ తరఫు న్యాయవాది వాదించారు. చివరి మొగల్‌ చక్రవర్తి బహదూర్‌షా జాఫర్‌  నుంచి బ్రిటిష్‌ వాళ్లు స్వాధీనం చేసుకున్న కట్టడాలు, భవనాలను 1948 చట్టం ప్రకారం తాజా మహల్ ను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కోర్టుకు తెలిపారు. 

tags: taj, taj mahal, taj mahal case, supreme on tajmahal, supreme judgment on tajmahal

Related Post