పెట్టిన పొయ్యి, క‌ట్టిన ఇల్లు లేకున్నా గ‌రిప‌ట్టీ

news02 June 7, 2018, 11:25 a.m. general

old couple 3
ఆసిపాబాద్: లంచాల‌కు మ‌రిగిన అధికారులు ఎంత‌కైనా బ‌రి తెగిస్తార‌ని మ‌రోసారి రుజువైంది. వ‌చ్చిన జీతాలు స‌రిపోనంటూ..కొంద‌రు అధికారులు జ‌నం సొమ్మును అప్ప‌నంగా కాజేస్తున్నారు. క‌నీస మాన‌వ‌త్వం కూడా మ‌రచిపోయి పందికొక్కుల ప‌బ్లిక్ సొమ్మును మింగిస్తేస్తున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓపంచాయితీ కార్య‌ద‌ర్శి ఇలాగే చావుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఓవృద్ద దంప‌తుల ఫించ‌న్ కొట్టేసేందుకు వేసిన ఎత్తుగ‌డ ఇప్పుడు ఆజిల్లాలో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. 

ps reciept

ఆసిఫాబాద్ జిల్లా చింత‌మానిప‌ల్లి మండ‌లం క‌ర్జెల్లి గ్రామానికి చెందిన అంగెడి శీక‌టి(80) వృద్ద దంప‌తుల‌కు తిన‌డానికి తిండి కూడా లేక‌పోవ‌డంతో...ఊర్లో ఓ పూరి గుడిసె వేసుకొని బ‌తుకు వెళ్ల‌దీస్తున్నారు. ఈపండుటాకుల‌ను ఎవ‌రు ప‌ట్టించుకొకున్న క‌లిగిన కాడికి... క‌లో గంజో తాగి జీవిస్తున్నారు. ఉన్న‌దాంట్లో చెరో బుక్క తిని బ‌తుకుతున్నారు. అయితే చావుకు ద‌గ్గ‌ర‌రైనా...క‌లిసి ఒక్క‌టిగా బ‌తుకుతున్న ఈవృద్ద‌దంప‌తుల‌పైన ఆఊరు పంచాయితీ పంచాయితీ కార్య‌ద‌ర్శి తన చేతి వాటాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. స‌ర్కారు నుంచి వీరికి వ‌చ్చే రూ.1000 ఫించ‌న్ కొట్టేసేందుకు కొత్త ఎత్తుగ‌డ వేశాడు. ఈదంప‌తుల‌కు ఇల్లు లేకున్నా...రూ.500ల గ‌రి ప‌ట్టీ విధించి ఫించ‌న్ డ‌బ్బులు నొక్కేయ‌డం కొస‌మెరుపు.  అయితే ఇది కాస్తా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో...సంచ‌ల‌నంగా మారింది. 

old couples 2

అయితే ఈవిష‌యం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ కావ‌డంతో... అధికారుల తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అధికారులు మ‌రీ ఇంత దౌర్భగ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేమిట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు వితంతువులు, వృద్ధులు, విక‌లాంగులకు ఫించ‌న్ ఇస్తున్నమ‌ని ఊద‌ర‌గొడుతున్న... స‌ర్కారు క్షేత్ర స్థాయిలో ఇలాంటీ ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బంగారు తెలంగాణ‌లో అధికారులు లంచాలు అడిగితే...చ‌మ‌డ‌లు తీస్తామ‌న్న కేసీఆర్ ఒక్కసారి ఇలాంటి విష‌యంపై లుక్కేస్తే బాగుంటుంద‌ని నెటిజ‌న్‌లు సెటైర్లు వేస్తున్నారు. 
 

tags: harrasment to the old couples,asifabad,kargelli,shikati,chintamanipally,1000,telangana pension,telangana pension status,telangana pension scheme,telangana pensioners health card,telangana pension list telangana pension rules,telangana pension form,telangana pensioners association,telangana pension application form download telangana pensioners payment details,telangana pension portal,telangana pension news,telangana pension application form download pdf,telangana pension particulars,telangana pension application,telangana pension application status,telangana pension apply,telangana pension apply online,telangana pension age limit,telangana pension annual verification certificate telangana pension arrears,telangana pension application forms,telangana beedi pension status online,telangana beedi pension status,telangana beedi pension,telangana bd pension status,telangana beedi pension list,telangana beedi workers pension details,bd pension telangana,telangana grameena bank pension,telanga

Related Post