ఎగ్జిబిష‌న్లో విరిగిపోయిన జాయింట్ వీల్‌

news02 May 28, 2018, 12:19 p.m. general

anantha exibihition incident

అనంత‌పురం: అనంత‌పురంలో దారుణం జ‌రిగింది. ప్రభుత్వ జూనియర్ క‌ళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రోబో యూనివ‌ర్స‌ల్ ఎగ్జిబిష‌న్ లో ప్ర‌మాద చోటుచేసుకుంది.  జెయింట్ వీల్ నుంచి రెండు పెట్టెలు విరిగిపడ్డాయి. దీంతో పెట్టెలో ఉన్న ఓచిన్నారి కింద ప‌డి అక్క‌డిక్క‌డే మృతి చెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంది. 

anantha incident

జెయింట్ వీల్ న‌డుపుతున్న వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో ఉండ‌డంతోనే... ఈప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ఎగ్జిబిష‌న్‌కు వ‌చ్చిన వారు చెబుతున్నారు. మ‌ద్యం మ‌త్తులో జెయింట్ వీల్‌ను వేగంగా తిప్పిడం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. దీంతో పెట్టెలు అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోయిన‌ట్లు తెలిపారు. అయితే జాయింట్ వీల్ ఆప‌రేట‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

tags: anantha incident,exhibition,joint wheel, ap, govt junior college

Related Post