మోడీకి .. ఈ చిన్నారి ఏం చెప్పిందో చూడండి..!

news02 Feb. 21, 2019, 8:59 a.m. general

/gujarath_girl_letter_to_modi_on_pulwama_attack

గుజరాత్ : పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్ల చావుకు కార‌ణ‌కులలైన  జైషే మహమద్, పాకిస్తాన్ పై రివేంజ్  తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ ప‌దేళ్ల‌ చిన్నారి ప్రధాని నరేంద్రమోడీకి రాసిన  లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ లోని సూరత్ జిల్లాకు చెందిన మనాలి నాలుగో తరగతి చదువుతోంది. పుల్వామా జిల్లాల్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన వార్త టీవీలో చూసి తెల్సుకున్న మనాలి చాలా భాధపడింది.  తాను ప్రధానితో మాట్లాడాలని అనుకొంటున్నానని తన తల్లితో చెప్పిందట‌. ప్రధానిని మ‌న‌ము క‌ల‌వ‌డం కుద‌ర‌ద‌ని చెప్పిన త‌ల్లి..  నీవు చెప్పదల్చుకొన్నది లేఖ  ద్వారా తెలియజేయమని చెప్పింద‌ట‌. దీనితో ఆ చిన్నారి మనాలి ప్రధానికి రాసిన లేఖ ఇలా వుంది. "మోడీజీ.. మీపై నమ్మకముంది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను  ఒక్కొక్కరిని కాల్చి చంపెయ్యాలని కోరింది. అలాంటి వాళ్లను చంపడం పాపం కాదని, దుర్మార్గులను చంపడం తప్పేమీ కాదని భగవద్గీతలోనూ చెప్పినట్లు మనాలీ గుర్తుచేసింది". మనాలి వ్రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

tags: gujarath girl manali, letter to modi, pm narendramodi, pulwama terrar attack, ten years old, girl, 40 jawans died, pakisthan , jaish e ahamadh

Related Post