తెలంగాణలోని ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై మహానటి సినిమా దర్శకులు నాగ్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ స్నేహితుడు కెమెరామెన్‌గా ఒకరు ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారట. చికిత్స కోసమని అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరు అందుబాటులో లేకపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ నాగ్ అశ్విన్ తన స్నేహితుడి పట్ల జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చారు. రోడ్డు ఆక్సిడెంట్ లో గాయపడిన తన ఫ్రెండ్ చనిపోయాడని నాగ్ అశ్విన్ చలించిపోయాడు. అతనికి ఆక్సిడెంట్ జరగ్గానే చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపాడు. ఐతే ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడని చెప్పుకొచ్చాడు. ఆదివారం కావడంతో వైద్యులెవరు అందుబాటులో లేరని... అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారని చెప్పుకొచ్చాడు.
ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తే నా స్నేహితుడు బతికేవాడని కన్నీరు మున్నిరయ్యాడు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేమని ధీనంగా ప్రశ్నించాడు నాగ్ అశ్విన్. ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్ సర్ అని నిలదీశాడు. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్ అని నాగ్ అశ్విన్ చెప్పాడు. ఈ ధీన పరిస్థితి గురించి నేను ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్ అంటూ కేటీఆర్ ను ప్రశ్నించాడు. మరి నాగ్ అశ్విన్ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.