నుజ్జునుజ్జు అయిన ఐదు కార్లు

news02 June 1, 2018, 11:11 a.m. general

lorry accident in patni center
హైద‌రాబాద్: సికింద్రాబాద్ పాట్నీ సెంట‌ర్‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. అతి వేగంగా వ‌చ్చిన లారీ...డివైడ‌ర్‌ను ఢీకొట్టి స‌మీపంలోని కార్ల‌పైకి దూసుకెళ్లింది. దీంతో ఐదు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈసంఘ‌ట‌న‌లో ప‌లువురుకి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని పోలీసులు వెంట‌నే స‌మీప ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన లారీ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

tags: lorry accident in patny center,secunderbad,police,lorry driver

Related Post