ఆ సారా తాగిన వారంతా..

news02 Feb. 10, 2019, 7:16 a.m. general

liquer

దేశంలో కల్తీ సారాపై ఎంత ఉక్కుపాదం మోపినా దాన్ని మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నాటుసారా తాగి ఏకంగా 92 మంది చనిపోయారు. సహరాన్‌‌పూర్‌లో 46 మంది, రూర్కీలో 20 మంది, మీరట్‌లో 18 మంది,  కుశీనగర్‌లో 8 మంది కల్టీ సారాకు బలయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్‌‌ పూర్‌లో చనిపోయిన మొత్తం 46 మందికి పోస్టుమార్టం నిర్వహించగా అందులో 36 మంది నాటుసారా తాగడం వల్లే చనిపోయారని తేలింది. 

liquer

నాటు సారా తాగి అస్వస్థతకు గురై పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారిలో కొంత మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. ఇక కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. 

 

tags: liquer, adultration liquer, 92 died about adultration liquer, 92 died in uttarpradesh, people died about adultration liquer

Related Post