వెడ్డింగ్ రింగ్.. వేలుకి కుట్టేస్తారా?

news02 March 12, 2018, 12:44 p.m. general

చెవులు.. ముక్కు కుట్టించుకోవడం.. వాటికి ఆభరణాలు ధరించడం మన సంప్రదాయం. అయితే ప్రస్తుతం ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. చెవి..ముక్కు.. ఆఖరికి నాలుకపై కూడా రంధ్రాలు పొడిపించుకుని కమ్మలు.. రింగ్స్ వంటివి ధరిస్తున్నారు.  అబ్బాయిలు కూడా అమ్మాయిలకు పోటీగా చెవులు కుట్టించుకోవడం చూసాం. అయితే ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ ఎంటర్ అయింది.

వెడ్డింగ్ రింగ్ ని వేలికి పెట్టుకోవడం కాదు.. ఏకంగా వేలికి కుట్టించేసుకుంటున్నారు. ఇదేం ఫ్యాషన్ బాబోయ్ అనుకుంటున్నారా? నిజం. ఇప్పుడు ఈ తరహా ఫ్యాషన్ చాలా చోట్ల ఫాలో అయిపోతున్నారు. వేలికి వెడ్డింగ్ రింగ్ అతుక్కుని ఉండేలా కుట్లు వేయించుకుంటున్నారు. ఈ తరహా వెడ్డింగ్ రింగ్ ధరిస్తే వారికి పెళ్లైందని అర్ధమన్నమాట.

ఫ్యాషన్ సంగతి దేవుడెరుగు.. రింగ్ కుట్టించుకున్న తరువాత వేలికి ఇన్ఫెక్షన్ సోకినా.. పుండ్లు పడ్డా.. డాక్టర్లకి వేలకి వేలు సమర్పించుకోవాలి.. అంతేనా.. వేలు పోయినా ఆశ్చర్యం లేదు.  

 

tags: pierced, weddingring, marriage, fashion, newtrend

Related Post