జీఎస్టీ ట్రైల‌ర్ తొల‌గించిన యూ ట్యూబ్

news02 Feb. 22, 2018, 11:45 a.m. general

జీఎస్టీ ఎఫెక్ట్ తో డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌కు తెలుగు రాష్ట్రాల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌ల‌ను చేసిన కేసుకు సంబంధించి సీసీఎస్ ఎదుట విచార‌ణ‌కు వ‌ర్మ హాజ‌ర‌య్యారు.మ‌రోసారి ఈ కేసుకి సంబంధించి సీసీఎస్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే  తాజాగా మ‌రికొన్ని కేసులు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్నాయి. విశాఖ‌ప‌ట్నంలో వ‌ర్మ‌పై మ‌హిళా సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. వ‌ర్మ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా సంఘ నేత‌లు ఎంవీపీ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై స్పందించిన హోం మంత్రి చిన‌రాజ‌ప్ప కేసు న‌మోదు చేయాల్సిందిగా పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇక విజ‌య‌వాడ‌లోనూ వ‌ర్మ‌పైకేసులు న‌మోదు చేసేందుకు మ‌హిళా సంఘాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. 

ఇదిలా ఉంటే యూ ట్యూబ్ యాజ‌మాన్యం జీఎస్టీ ట్రైల‌ర్ ను యూట్యూబ్ నుంచి తొల‌గించింది. గ‌త నెల‌లో సినీ ర‌చ‌యిత జైకుమార్ జీఎస్టీ టైటిల్, ఆర్ట్ వ‌ర్క్ త‌న‌దేనంటూ యూ ట్యూబ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన యాజ‌మాన్యం ట్రైల‌ర్ ను తొల‌గిస్తున్న‌ట్లు జై కుమార్ కు లేఖ పంపింది. ఇక ఈ మూవీకి సంగీతం అందించిన ఎం.ఎం.కీర‌వాణితో పాటు స‌హ‌కారం అందించిన ప‌లువురికి సీసీఎస్ పోలీసులు నోటీసులు పంపే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. 

 

tags: gst, ramgopalvarma, director,tollywood, ccs, youtube

Related Post