వీడి ప్రేమకు హ్యాట్యాఫ్ చెప్పాల్సిందే..!

news02 July 2, 2019, 11:10 p.m. general

man_pull_rail_chain

పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో.. పిల్లలకు కూడా తల్లిదండ్రులపై అంతే ప్రేమ ఉంటుంది. ఈ విషయంలో కొందరికి మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు.. త‌మ  తల్లిదండ్రుల కోసం ఏం చేయ‌డానికైనా ముందుంటారు. .ఎవ‌రు ఏం అనుకున్నా..తాము చేస్తుంది త‌ప్ప‌ని తెలిసానా కూడా వారు ప‌ట్టించుకోరు. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన ఓ వ్య‌క్తి వెళుతున్న‌రైలును ఆపాడు. అది కూడా త‌ణ త‌ల్లి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చెయ్యడం కోసం ఆ కొడుకు ఏకంగా రైలునే ఆపేశాడు. బోగీలోని చైన్ లాగి రైలు ఆగిపోయేలా చేశాడు. వివ‌రాల్లోకి వెళితే.. డిల్లీకి చెందిన మనీష్ అరోరా తన తల్లితో కలిసి హబీబ్ గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మ‌ధురాకు బ‌య‌లుదేరారు.మ‌రి కాసెప‌ట్లో వారు మధురాలో దిగాల్సి ఉంది. అయితే  ఆ స‌మ‌యంలో త‌న త‌ల్లి బ్రేక్ ఫాస్ట్ చేస్తుంద‌ట‌. ఈ లోపు స్టేష‌న్ వ‌స్తే.. త‌న త‌ల్లి బ్రేక్ ఫాస్ట్ పూర్తికాకుండానే.. మ‌ధురాలో దిగిపోవ‌ల్సి వ‌స్తుంది. ఇది గ్రహించిన మనీష్.. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా బోగిలోని చైను లాగేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. అది మళ్లీ బయలుదేరేలోపు మనీష్ తల్లి తన బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసింది. ఆ విధంగా తల్లి మీద తనకున్న ప్రేమను మనీష్ చాటుకున్నాడు. అయితే ఇలా అకారణంగా రైలు చైన్ లాగడం నేరం. దీంతో రైల్వే పోలీసులు మనీష్ అరోరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయ‌డం.. త‌ర్వాత బెయిల్ పై మ‌నీష్ బ‌య‌టికి వ‌చ్చార‌నుకోండి. అయితే ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో  వైరల్ గా మారింది. తల్లి కోసం కొడుకు చేసిన పనిని కొంద‌రు మెచ్చుకుంటుంటే.. ప‌ది రూపాయ‌ల బ్రేక్  ఫాస్ట్ కు అయ్యే ఖ‌ర్చుకోసం.. ఇంతా క‌క్కుర్తా ..రా బాబు అంటు మ‌రికొంద‌రు సెటైర్లు విసురుతున్నారు.

manish_pull_rail_chain., delhi, shathabdi express rail, madhura railway station

tags: manish arora, delhi, pull rail chain, shathabdi express rail, mother ,finish , breack fast, madhura, indian railway

Related Post