చంపించినందుకు బాధపడటం లేదు..

news02 Sept. 15, 2018, 9:38 p.m. general

pranay murder

మిర్యాలగూడ (నల్గొండ)- నల్గొండ జిల్లాలో పరవు హత్య సంచలనం సృష్టించింది. తన కుమార్తే వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో ఆ తండ్రి అతన్ని దారుణంగా హత్య చేయించాడు. ఈ హత్యా ఉదంతం ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది. మిర్యాలగూడ ముత్తిరెడ్డికుంటకు చెందిన బాలస్వామి-ప్రేమలతల కుమారుడు ప్రణయ్ అదే ఉరుకు చెందిన వ్యాపారవేత్త మారుతురావు కూతురు అమృత టెన్త్ క్లాస్ నుంచి స్నేహితులు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసిన అమృత తండ్రి పలు మార్లు ప్రణయ్ ని తన కూతురు ను మరిచిపోవాలని హెచ్చరించాడు. 

amrutha

ఐనప్పటికి ప్రణయ్, అమృతలు గత జనవరిలో ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు చెలరేగడంతో ఒకరిపై ఒకరు పోలీసు కేసులు సైతం పెట్టుకున్నారు. ఐతే తాను ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని అమృత చెప్పడంతో పోలీసులు అమ్మాయిని ప్రణ్య్ దగ్గరకు పంపించారు. దీంతో వారిద్దరు కాపురం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే అబ్బాయి తల్లితండ్రులు ప్రణయ్, అమృతల వివాహ రిసెప్షన్ వైభవంగా నిర్వహించారు. ఐతే అమృత గర్బిని కావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా.. ఎప్పటినుంచో ప్రతీకారంతో రగిలిపోతున్న అమ్మాయి తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చిన దుండగుడు ప్రణయ్ పై కత్తితో దాడి చేశాడు.

pranay

 ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గర్బిణిగా ఉన్న అమృత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విచారణ జరిపిన పోలీసులు అమృత తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్ లే ఈ హత్య చేయించారని చేల్చారు. పరారీలో ఉన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఇక తానే ఈ హత్య చేయించినట్లు అమృత తండ్రి మారితీ రావు అంగీకరించాడు. తన కూతురు జోలికి రావొద్దని పలుమార్లు హెచ్చరించినా ప్రణయ్ వినలేదని ఆయన పోలీసులకు చెప్పాడు. తన ఇష్టానికి విరుద్దంగా అమృతను హత్య చేయించానని.. అందుకు తాను ఏ మాత్రం బాధ పడటం లేదని మారుతీ రావు చెప్పుకొచ్చాడు. తన కూమార్తె కంటే సమాజంలో పరువే ముఖ్యమని భావించానని.. జైలుకు వెళ్లేందుకు సిద్దపడే ప్రణయ్ ని హత్య చేయించానని పోలీసులకు తెలిపాడు.
 

pranay amrutha

tags: pranay, amrutha, pranay amrutha, pranay murder, pranay murder case, pranay murder in miryalaguda, pranay murder in nalgonda, pranay murder case in nalgonda, pranay amrutha love story

Related Post