బోల్తా ప‌డిన అత్త‌

news02 June 16, 2018, 11:31 a.m. general

kannig kodalu
గుంటూరు: మొన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీపురంలో సొంత భ‌ర్త‌ను అంత‌మొందించేందుకు పెళ్లాం ఎలాంటీ స్కెచ్చేసేందో గుర్తుంది కాదా..?ప్రియుడు ప్రేమ‌ను కాద‌న‌లేక...శిరీష అనే అమ్మాయి ఎలాంటీ ఎత్తుగ‌డ వేసిందో యాదికుంది కదా..? ల‌వ‌ర్‌తో క‌లిసి భ‌ర్త‌ను చంపేందుకు సినీ ఫ‌క్కీలో దారి దోపిడి సీన్ క్రియేట్ చేసి హ‌త‌మార్చింది తెలిసిందే క‌దా. అచ్చం అలాంటీ సంఘ‌ట‌నే గుంటూరులో మ‌రొక‌టి జ‌రిగింది. అయితే అది ప్రేమ కోసం జ‌రిగితే...ఇది డ‌బ్బు కోసం జ‌ర‌గ‌డం విశేషం. అచ్చంగా పార్వ‌తీపురంలో శిరీష వ్య‌వ‌హ‌రించిన ప్లాన్‌నే అనుస‌రించ‌బోయిన తాడేప‌ల్లిలో ఓకోడ‌లు పోలీసుల‌కు శిరీష‌లాగే అడ్డంగా దొరికిపోయింది. 

police press meet

కొద్దిరోజుల క్రితం గుంటూరు తాడేపల్లి పెనుమాక‌కు మేకా కమల ఆమె కోడలు మేకా శివపార్వతిలు ఇంట్లో ఉండగా...3గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 78 లక్షల నగదు, 26 సవర్ల బంగారు వస్తువుల‌ను దొంగ‌త‌నం చేశారు. అడ్డువ‌చ్చిన అత్త మేకా క‌మ‌ల‌ను చిత‌క‌బాదారు. అయితే భారీ ఎత్తున న‌గ‌దు...బంగారం దొంగ‌త‌నం కావ‌డంతో...ఈకేసు స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. దీంతో పోలీసులు ఈకేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొత్తం 10 బృందాలుగా  ఏర్ప‌డి కేసును ద‌ర్యాప్తు చేశారు. ద‌గ్గ‌ర ఉన్న సీసీటీవీ పుటేజిని ప‌రిశీలించ‌డంతో...పాటు అన్ని కోణాల్లో విచార‌ణ చేశారు. 

police uniform

అయితే పోలీసు ద‌ర్యాప్తులో న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌ప‌డ‌డం విశేషం. మేకా క‌మ‌ల ఇంట్లో చోరీకి స్కెచెసింది కోడ‌లు మేకా శివ‌పార్వ‌తేన‌ని తేలింది. సీసీటీవీ పుటేజీని ప‌రిశీలించిన ఖాకీలు...అనుమానం వ‌చ్చి కోడ‌లు శివ‌పార్వ‌తిని ప్ర‌శ్నించ‌డంతో...అసలు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. పొలం అమ్మిన డబ్బులు ఇవ్వ‌కుండా అత్త ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని...అందుకే డ‌బ్బుల‌ను కాజేయాల‌ని భావించిన‌ట్లు ఒప్పుకుంది. అందుకోసం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారమే దోపిడి సీన్ క్రియేట్ చేసిన‌ట్లు తెలిపింది. అందుకు త‌మ బంధువులు కొండమడుగుల లక్ష్మీప్రసన్న, వంగా సీతారామిరెడ్డి, వెంకటరెడ్డి చింతలచెరువు రాజు, చెంబేటి మల్లిఖార్జునరావు, తోట గోపీచంద్‌, సాయిల‌తో కలిసి దోపిడి కుట్రకు తెర‌లేపిన‌ట్లు చెప్పింది. అంతేకాదు క‌మ‌ల‌మ్మ‌పై దాడి చేసి న‌గ‌దు దోచుకెళ్లుతున్న స‌మ‌యంలో...అనుమానం రాకుండా తానే కావాల‌ని పెన్నుతో దాడి చేసుకున్న‌ట్లు తెలిపింది. 

guntur junction

అయితే ఈవిష‌యం కాస్తా ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌డంతో...స్థానికులు శివ‌పార్వ‌తి నిర్వ‌హ‌కంపై ముక్కున వేలేసుకుంటున్నారు. అమాయ‌కంగా ఉండే శివ‌పార్వ‌తి ఇంత క‌న్నింగ్ అనుకోలేద‌ని అవాక్క‌వుతున్నారు. సొంతింటి కొంప కోల్లేరు చేసేందుకు కోడ‌లు వేసిన స్కెచ్‌ను చూసిన విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే ఇప్ప‌టికైనా ఆస్తి, అక్ర‌మ సంబంధాల విష‌యాల్లో ఇంటి వారిపై కూడా ఓ క‌న్నెసి ఉస్తేనే ఇలాంటీ జిత్తుల మారిల‌ ఆట క‌ట్టించ‌వ‌చ్చంటున్నారు. 

tags: kannig kodalu, Crime News,Robbery case,guntur,kamal,shivaparvati,police,guntur policerobbery news,robbery news in india,robbery news articles,robbery news in chennai,robbery newspaper report,robbery news uk robbery news 2018,robbery news philippines,robbery news in malaysia,robbery news near me,robbery news report,robbery news south africa,robbery news articles 2017,robbery news articles in the philippines,robbery news articles in malaysia,robbery news adelaide,robbery news australia,robbery news articles 2016,robber search news anchor,bank robbery news anchor,atlanta bank robbery news,a robbery news report,a robbery news,a bank robbery news report,a bank robbery news,robbery news ,angladesh,robbery news baltimore,bank robbery news,news bank robbery san jose ca,bank robbery news 12 nj,bank robbery news channel 3,bank robbery news paper,bank robbery news reporter,bank robbery news today,robbery news cape town,robbery news cash,channel 7 news robbery,chicago robbery news,current robbery

Related Post