ఆగదిలోకి వెళ్లడానికి..

news02 Aug. 15, 2018, 7:46 a.m. general

amrapali

వరంగల్ (అర్బన్ డెస్క్)- దెయ్యం అంటే ఎవ్వరికి భయం ఉండదు చెప్పండి. చాలా మందికి దెయ్యం పేరు వింటేనే వణికిపోతారు.. అదే దెయ్యం ఇంట్లో ఉందంటే ఇంకేమైనా ఉందా.. కానీ దెయ్యం ఏకంగా తన ఇంట్లోనే ఉందని చెబుతోంది వరంగల్ కలెక్టర్ అమ్రపాలి. తాను నివసిత్తున్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దెయ్యం ఉందని స్వయంగా ఆమ్రపాలి చెప్పింది. వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసి సరిగ్గా 133ఏళ్లు గడిచాయట. అసలు ఈ భవనాన్ని నిర్మించిందెవరని కలెక్టర్ ఆమ్రపాలి పరిశోధించి.. చివరకు నిజాం కాలంలో ఇంజినీర్ గా ఉన్న జార్జ్ పామర్ భార్య వరంగల్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయానికి 133 ఏళ్ల క్రితం పునాది రాయి వేసిందని తేల్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ భవనంలో దెయ్యం ఉందని గతంలో పనిచేసిన కలెక్టర్లు చెప్పారని ఆమ్రపాలి చెబుతోంది. అందుకే భవనంలోని పై గదిలోకి వెళ్లి పడుకోవడానికి తనకు భయం అని స్పష్టం చేసింది ఆమ్రపాలి.
 

tags: amrapali, collectorate amrapali, amrapali ias, warangal ias amrapali, amrapali about ghost, amrapali on ghost, amrapali ghost, ghost in collectorate, ghost in warangal collectorate

Related Post