పోలీసు కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లిన తెలంగాణ ఛత్తీస్ గఢ్ స‌రిహ‌ద్దు ..!

news02 March 2, 2018, 12:33 p.m. general

12_Maoist_Enconter

భూపాల‌ప‌ల్లి : తెలంగాణ ఛత్తీస్ గఢ్ స‌రిహ‌ద్దు ప్రాంతం మ‌రో సారి పోలీసుల కాల్పుల శ‌బ్దాల‌తో మ‌ర్మోగింది.  తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జ‌రిగిన  కాల్పులల్లో 12మంది మావోయిస్టులు మృతి వాత ప‌డ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట .. ఛత్తీస్ గఢ్‌ లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ కూడా ఉన్నారు  సంఘటనా స్థలం నుంచి తుపాకులు, స్కానర్‌, ల్యాప్‌ట్యాప్‌, .41వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ సుశీల్‌ అనే కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12_Maoist_Enconte

పూజారికాంకేడు ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్లు తెలుసుకున్న తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు గ్రేహౌండ్స్ దళాలు రెండ్రోజులుగా ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్నాయి. ఈరోజు ఉదయం భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఘ‌ట‌నా స్థ‌లం నుంచి .. మరికొందరు మావోయిస్ట్ లు పరారయ్యారు. మిగిలిన వారి కోసం కూంబింగ్‌ దళాలు సమీప గ్రామాల్లో గాలింపు జ‌రుపుతున్నాయి. 

ఎదురుకాల్పుల సమాచారం తెలుసుకున్న జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ .. ఓఎస్డీ హుటాహుటిన సంఘటనా స్థ‌లానికి చేరుకున్నారు. వారితో పాటు పెద్దయెత్తున భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. వెంకటాపురం ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ కావడంతో కూంబింగ్‌ విస్తృతం చేశారు. 

Related Post